News April 6, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

☞ జిల్లాలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు ☞ హజ్ యాత్ర అనేది ముస్లింలకు ఓ కల: మంత్రి ఫరూక్ ☞ రాములోరి కళ్యాణంలో కుటుంబ సమేతంగా పాల్గొన్న మంత్రి బీసీ ☞ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తాం: ఎమ్మెల్సీ భూమిరెడ్డి ☞ నందిపాడులో ప్రమాదం.. యువకుడి మృతి ☞ బీసీ రాజారెడ్డిని కలిసిన సింగర్ కరీముల్లా ☞ కురుకుందలో గాలివాన బీభత్సం ☞ రేపు కలెక్టరేట్లో PGRS: కలెక్టర్ రాజకుమారి
Similar News
News April 17, 2025
బాలీవుడ్‌లో తెలుగు డైరెక్టర్ హవా.. సీక్వెల్ ప్రకటన!

టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలీవుడ్‌లో తన తొలి సినిమా ‘జాట్’తో ప్రేక్షకులను మెప్పించారు. సన్నీ డియోల్ నటించిన ఈ మూవీ APR 10న విడుదలై ఇప్పటివరకు రూ.70 కోట్ల వసూళ్లు రాబట్టింది. దీంతో నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ దీనికి సీక్వెల్ ‘జాట్-2’ను ప్రకటించింది. ఈ మూవీనీ గోపీచందే తెరకెక్కించనున్నారు. అటు సన్నీడియోల్ దీనితో పాటు బోర్డర్-2, గదర్-3 లోనూ నటిస్తున్నారు.
News April 17, 2025
ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్

AP: ఎస్సీ వర్గీకరణ-2025కు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. దీంతో ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ మేరకు గెజిట్ విడుదల చేస్తూ న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి ఉత్తర్వులు ఇచ్చారు. కాగా ఇటీవల ఆర్డినెన్స్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
News April 17, 2025
రాష్ట్రంలో పెరగనున్న మద్యం ధరలు?

TG: ఇటీవల బీర్ల ధరలను 15% పెంచిన ప్రభుత్వం ఇప్పుడు లిక్కర్ ధరలు పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. చీప్ లిక్కర్ మినహా రూ.500కు పైగా ధర ఉండే లిక్కర్ బాటిళ్లపై కనీసం 10% పెంచనున్నట్లు సమాచారం. దీని ప్రకారం బాటిల్‌పై మినిమమ్ రూ.50 పెరిగే అవకాశముంది. ఆయా బాటిళ్ల ఎమ్మార్పీ ఆధారంగా రేట్లు పెరగనున్నాయి. అధికారులతో సమీక్షించిన అనంతరం ధరల పెంపుపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.