News March 18, 2025
నంద్యాల జిల్లాలో నేర నియంత్రణే లక్ష్యంగా విజువల్ పోలీసింగ్: ఎస్పీ

నంద్యాల జిల్లాలో నేర నియంత్రణే లక్ష్యంగా విజువల్ పోలీసింగ్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా వేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం జరిగే నేరాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ అవగాహన కల్పిస్తున్నామన్నారు. నేరాలు చేస్తే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Similar News
News March 21, 2025
విశాఖలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

విశాఖలో ఇంటర్ విద్యార్థి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. GRP పోలీసుల వివరాల ప్రకారం.. కంచరపాలెంలోని ఇందిరానగర్‌లో నివాసముంటున్న అంబటి రేవంత్ కుమార్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. పరీక్షలు సరిగా రాయలేదంటూ మనస్తాపం చెందాడు. ఈక్రమంలోనే బుధవారం అర్ధరాత్రి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News March 21, 2025
హనీట్రాప్: కర్ణాటక కాంగ్రెస్‌లో చీలిక!

కర్ణాటకలో 48 మంది నేతలు హనీట్రాప్‌లో చిక్కినట్టు స్వయంగా కాంగ్రెస్ మంత్రే బయటపెట్టడం అనుమానాలకు తావిస్తోంది. కొందరు మంత్రులు, MLAలు వలపు వలలో చిక్కారని, దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేయడం వర్గపోరుకు నిదర్శనమని విశ్లేషకులు అంటున్నారు. సొంతపార్టీ నేతలపై విచారణ కోరడమే ఇందుకో ఉదాహరణగా చెప్తున్నారు. CM సిద్దరామయ్య, DYCM శివకుమార్ విభేదాలు పార్టీలో చీలికను సూచిస్తున్నాయని పేర్కొంటున్నారు. మీరేమంటారు?
News March 21, 2025
NGKL: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ఈనెల 17న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతిచెందిన ఘటన బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. బిజినేపల్లి మం. సల్కర్‌పేటకు చెందిన శ్రీనివాసులు(55) బైక్‌పై సొంతూరుకి వెళ్తుండగా వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను HYDలోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ మేరకు కేసు నమోదైంది.