News March 15, 2025
నంద్యాల తాగునీటి సరఫరాపై ఉన్నత స్థాయి సమీక్ష

నంద్యాల జిల్లాలో తాగునీటి సరఫరాపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని కలెక్టర్ కార్యాలయంలో శనివారం సాయంత్రం నిర్వహించారు. కలెక్టర్ రాజకుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వేసవి ముంచుకొస్తున్న నేపథ్యంలో తాగునీటి సమస్యపై జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Similar News
News March 16, 2025
VKB: HMDA పరిధిలోకి 54 గ్రామాలు: DPO

హెచ్ఎండీఏ పరిధిలోకి వికారాబాద్ జిల్లాలోని 54 గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల12న ఉత్తర్వులు జారీ చేసిందని వికారాబాద్ DPO జయసుధ తెలిపారు. మోమిన్ పెట్ మండలంలో 3, పరిగి మండలంలో 4, పూడూరు మండలంలో 23, వికారాబాద్ మండలంలో 13, నవపేట మండలంలో 11 గ్రామపంచాయతీలను హెచ్ఎండీఏలో విలీనం చేస్తున్నట్టు పేర్కొన్నారు.
News March 16, 2025
కలకత్తా నుంచి కన్యాకుమారికి సైకిల్ ర్యాలీ

సీఐఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కలకత్తా నుంచి కన్యాకుమారి వరకు 6,500 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం గుండా సైకిల్ ర్యాలీని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ ర్యాలీ శనివారం రాత్రి ఆంధ్ర రాష్ట్రంలోకి విచ్చేసిన సందర్భంగా కంచిలిలో వారికి ఘనంగా స్వాగతం పలికారు. భారతమాతాకి జై అంటూ వారు నినాదాలు చేశారు. ఈ ర్యాలీ పాల్గొన్న 60 మందిని సత్కరించారు.
News March 16, 2025
నర్సీపట్నం: జీవితం మీద విరక్తితో ఆత్మహత్య

నర్సీపట్నం మండలం నీలం పేట గ్రామానికి చెందిన పెట్ల నూకయ్య నాయుడు అనే వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ ఎస్ఐ రాజారావు తెలిపారు. ఆయన గత కొద్దికాలంగా డయాబెటిస్ తదితర అనారోగ్యంతో బాధపడుతున్నాడని అన్నారు. దీంతో జీవితం మీద విరక్తి చెంది పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ శనివారం మరణించాడని పేర్కొన్నారు.