News May 25, 2024

నంద్యాల: నెల రోజులపాటు ఈ రెండు రైళ్లు రద్దు

image

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ట్రాక్ పనుల మరమ్మతుల పనుల కారణంగా రైళ్ల రద్దు మరికొంత కాలం పొడిగిస్తూ రైల్వే ఉన్నాతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారని డోన్ రైల్వేస్టేషన్ మేనేజర్ జి.వేంకటేశ్వర్లు తెలిపారు. గుంటూరు నుంచి డోన్(17228) రైలు, హుబ్బళ్లి నుంచి విజయవాడు(17329) జూన్ 30వ తేదీవరకు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి రైల్వే వారికి సహకరించాలని కోరారు.

Similar News

News March 12, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యంశాలు

image

➤ఆదోని ఘటనపై సీఎం, మంత్రుల దిగ్భ్రాంతి
➤ మహిళపై అత్యాచారయత్నం.. వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ కేసు
➤ హీరో బైక్ గెలుచుకున్న కర్నూలు యువకుడు
➤ ఆదోనిలో సంచలనంగా ఈశ్వరప్ప మృతి
➤ ఇంటర్ పరీక్షలు.. ఇద్దరు విద్యార్థుల డిబార్
➤ పోసాని కృష్ణమురళి విడుదలకు బ్రేక్.. గుంటూరుకు తరలింపు
➤ విద్యార్థులను మోసం చేసింది చంద్రబాబే: ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
➤ రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం ఆపండి

News March 12, 2025

కర్నూలు జిల్లాలో ఇద్దరు విద్యార్థుల డిబార్

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా బుధవారం ఇంటర్మీడియట్ రెండో సంవత్సర విద్యార్థులకు ఫిజిక్స్‌ పేపర్ 2, ఎకనామిక్స్‌ పేపర్ 2 పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలో ఇద్దరు విద్యార్థులను డిబార్ చేసినట్లు ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి గురువయ్య శెట్టి తెలిపారు. 20,499 మంది పరీక్షకు హాజరు కాగా 401 విద్యార్థులు గైర్హాజరైనట్లు వివరించారు. మద్దికేరలోని ఏపీ మోడల్ జూనియర్ కళాశాలలో ఇద్దరు విద్యార్థులు డిబార్ అయినట్లు చెప్పారు.

News March 12, 2025

పోసాని నేడు విడుదలయ్యేనా?

image

కర్నూలు జిల్లా జైలులో ఉన్న పోసాని కృష్ణమురళి విడుదలపై ఉత్కంఠ నెలకొంది. ఆయనకు కర్నూలు JFCM కోర్టు నిన్న బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆయనపై రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కర్నూలు జైలు నుంచి విడుదలయ్యేలోపు ఏ స్టేషన్‌ పోలీసులైనా వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లొచ్చన్న ప్రచారం నడుస్తోంది. కాగా ఈ నెల 4 నుంచి పోసాని కర్నూలు జైలులో ఉన్నారు.

error: Content is protected !!