News March 30, 2025
నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

ప్రతి సోమవారం నంద్యాల కలెక్టరేట్‌లో నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈనెల 31వ తేదీన రంజాన్ పండుగ సందర్భంగా కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా కేంద్రానికి రావద్దని ఆమె ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
Similar News
News April 2, 2025
రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం: విశాఖ సీపీ

విశాఖ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా ప్రమాద బాధితులకు బుధవారం లక్ష రూపాయలు పరిహారం అందజేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఇటీవల హిట్ రన్‌లో తీవ్ర గాయాలపాలైన మొండెం రామక్రిష్ణ, జన సన్యాసప్పాడుకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేశారు. ఇప్పటివరకు ఈ కేంద్రం ద్వారా 32 మందికి రూ.26,50,000 ఇచ్చినట్లు తెలిపారు.
News April 2, 2025
అనంత: ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం

అనంత ఆణిముత్యాలు ఎడ్యుకేషనల్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీ కింద ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులకు సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో “అనంత ఆణిముత్యాలు” ఎడ్యుకేషనల్ అండ్ డెవలప్మెంట్ సొసైటీపై సం.శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
News April 2, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

> వేసవిలో చిన్నారుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
> స్పాట్ వేల్యుయేషన్‌కు 683మంది: అల్లూరి డీఈవో
> పాడేరు: నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్
> గంగవరం: జీడిపిక్కల కొనుగోలు ప్రారంభం
> కిలో జీడి పిక్కలు రూ.150కు కొనుగోలు..ఎమ్మెల్యే శిరీష
> అరకులో అక్రమ నిర్మాణాలు: ఆదివాసీ గిరిజన సంఘం
> పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో భారీ వర్షం