News March 21, 2025
నంద్యాల: ఫరూక్ సతీమణి చివరి కోరిక.. HYDలోనే అంత్యక్రియలు

మంత్రి ఎన్ఎండీ ఫరూక్ సతీమణి షెహనాజ్(69) ఇవాళ తెల్లవారుజామున మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆమె తన అంత్యక్రియలను ఎక్కడ నిర్వహించాలో ముందుగానే నిర్ణయించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె చివరి కోరిక మేరకు హైదరాబాద్‌లోని ఆగాపుర, పాన్‌మండి ఖబరస్తాన్‌లో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా మంత్రి ఫరూక్ సతీమణి మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Similar News
News March 22, 2025
HYD: భార్య వీడియోలు భర్తకు పంపి.. బ్లాక్ మెయిల్!

విదేశంలో HYD యువతికి వేధింపులు ఎదురయ్యాయి. శ్రీకృష్ణానగర్ వాసి 2018లో పనికోసం దుబాయ్‌కు వెళ్లింది. అక్కడ పరిచయమైన అబూబాకర్ ఆమె వ్యక్తిగత వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడు. 2020లో బాధితురాలు HYD వచ్చేసింది. అయినా అతడి వేధింపులు ఆగలేదు. ఏకంగా ఆమె ఇంటి వద్దకు వచ్చాడు. కాల్ చేసినా ఆమె బయటకురావడం లేదని ఆ వీడియోలు ఆమె భర్తకు పంపాడు. ఈ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News March 22, 2025
నేడు ఈ జిల్లాల్లో వడగళ్ల వానలు

తెలంగాణలో వర్షాలు ఇవాళ కూడా కొనసాగనున్నాయి. మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లోనూ మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. నిన్న కురిసిన అకాల వర్షాలకు భారీగా పంట నష్టం జరిగింది.
News March 22, 2025
ALERT: సాతర్లలో గరిష్ఠంగా ఉష్ణోగ్రతలు నమోదు

గద్వాల జిల్లాలో 40 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. శుక్రవారం సాతర్లలో గరిష్ఠంగా 39.5, తోతినోనిదొడ్డి, ధరూర్, గద్వాల్, అలంపూర్‌లో 39.3 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరం అయితేనే మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లాలని నిపుణులు చెబుతున్నారు.