News March 13, 2025
నంద్యాల: బొలెరోతో ఢీకొట్టి.. చోరీ

బేతంచర్లకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి జస్వంత్ నంద్యాలలో బైక్‌ను కొనుగోలు చేసి బేతంచర్లకు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో తమ్మరాజు పల్లె ఘాట్ వద్ద దుండగులు జస్వంత్ బైకును బొలెరోతో ఢీ కొట్టారు. జస్వంత్ కిందపడిపోగా అతని చేతికి ఉన్న 4 తులాల బ్రేస్‌లెట్, 2 ఉంగరాలను బొలెరోలో వచ్చిన ముగ్గురు దొంగలు దోచుకున్నారు. ఘటనపై పాణ్యం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 14, 2025
MBNR: పెళ్లై వారం రోజులే.. అప్పుడే అనంతలోకాలకు!

వారం రోజుల క్రితమే పెళ్లైన ఓ యువకుడు రోడ్డుప్రమాదంలో మృతిచెందిన ఘటన MBNRలో గురువారం చోటుచేసుకుంది. SI రామ్‌లాల్ నాయక్ వివరాలు.. సీసీకుంట ఫర్డీపూర్‌కు చెందిన రాజు(30) బైక్‌పై లాల్‌కోటకు వెళ్తున్నాడు. మద్యంమత్తులో ఉన్న రమేశ్ బైక్‌పై లాల్‌కోట-ఫర్డీపూర్ వస్తూ రాజు బైక్‌ను ఢీకొట్టగా తీవ్రంగా గాయపడ్డ అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 14, 2025
MBNR: పెళ్లై వారం రోజులే.. అప్పుడే అనంతలోకాలకు!

వారం రోజుల క్రితమే పెళ్లైన ఓ యువకుడు రోడ్డుప్రమాదంలో మృతిచెందిన ఘటన MBNRలో గురువారం చోటుచేసుకుంది. SI రామ్‌లాల్ నాయక్ వివరాలు.. సీసీకుంట ఫర్డీపూర్‌కు చెందిన రాజు(30) బైక్‌పై లాల్‌కోటకు వెళ్తున్నాడు. మద్యం మత్తులో ఉన్న రమేశ్ బైక్‌పై లాల్‌కోట-ఫర్డీపూర్ వస్తూ రాజు బైక్‌ను ఢీకొట్టగా తీవ్రంగా గాయపడ్డ అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 14, 2025
గ్రూప్-3 ఫలితాలు విడుదల

టీజీపీఎస్సీ వరుసగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫలితాలు విడుదల చేస్తోంది. మూడు రోజుల క్రితం గ్రూప్-1, రెండు రోజుల కిందట గ్రూప్-2 రిజల్ట్స్ ఇవ్వగా తాజాగా గ్రూప్-3 ఫలితాలు వెలువరించింది. జనరల్ ర్యాంకింగ్స్‌తో పాటు మాస్టర్స్ క్వశ్చన్ పేపర్స్, ఫైనల్ కీ కూడా విడుదల చేసింది. 1365 గ్రూప్-3 పోస్టులకు గతేడాది నవంబర్ 17,18 తేదీల్లో పరీక్షలు నిర్వహించగా 2.69 లక్షల మంది హాజరయ్యారు.
Results PDF: <