News April 21, 2025
నంద్యాల: రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జోష్య హరిణిరెడ్డి(6) మృతి చెందింది. ఆదివారం ఉదయం కారును బొలెరో ఢీకొనడంతో చిన్నారితోపాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. తాడిపత్రి ఆసుపత్రికి తరలించి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపూర్ తీసుకెళ్తుండగా జోష్య మృతి చెందినట్లు కొలిమిగుండ్ల సీఐ మద్దినేని రమేశ్ వెల్లడించారు.
Similar News
News April 21, 2025
ప్యాదిండిలో 2 బైకులు.. కారు ఢీ

చెన్నై కొత్తపల్లి మండలం ప్యాదిండి గ్రామం వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఒక కారు ఢీకొన్నాయి. దీంతో రామగిరి మండలం శ్రీహరిపురం గ్రామానికి చెందిన సాయి చనిపోయాడు. ప్యాదిండి గ్రామానికి చెందిన రమేశ్‌కి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం గాయపడిన రమేశ్‌ను చికిత్సకు ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 21, 2025
ఆటోనగర్ లాడ్జీల్లో తనిఖీలు

విజయవాడ ఆటోనగర్‌లోని లాడ్జీల్లో శనివారం అర్ధరాత్రి పటమట పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో భాగంగా పేకాట ఆడుతున్న ఐదుగురిని, వ్యభిచారం చేస్తున్న ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పటమట పోలీసులు తెలిపారు.
News April 21, 2025
వినుకొండ: క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. యువకుడి మృతి

వినుకొండ: పట్టణంలో క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. శనివారం క్రికెట్ ఆడుతుండగా గౌస్ బాషా (చంటి) అనే యువకుడు గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, కొద్దిసేపటికే మృతి చెందాడు. మూడేళ్ల క్రితమే వివాహమైన చంటి మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన స్థానికంగా కలచివేసింది. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు భౌతికకాయానికి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.