News April 4, 2025

నంద్యాలలో ఈనెల 10న జాబ్ మేళా

image

ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏప్రిల్ 10న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. ఈ జాబ్ మేళాకు 14 ప్రైవేటు కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. పదవ తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, B.Tech (Mechanical), B/D/M.Pharmacy, పీజీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులన్నారు.

Similar News

News April 18, 2025

నెల్లూరు: ప్రజలకు ఈకేవైసీ కష్టాలు

image

రేషన్ కార్డుదారులకు మరోసారి ఈకేవైసీ కష్టాలు వచ్చాయి. గతంలో ఈకేవైసీని వైసీపీ ప్రభుత్వం చేపట్టింది. సరిగా వేలిముద్రలు పడని వారివి ప్రస్తుతం పెండింగ్ చూపిస్తున్నాయి. కొత్త రేషన్ కార్డుల జారీలోనూ సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పిల్లలు, పెద్దలకు ఈకేవైసీ పూర్తిచేయాలని భావించింది. పొదలకూరు మండలంలోనే 6,125 మందికి ఈకేవైసీ పెండింగ్ ఉన్నట్లు సివిల్ సఫ్లై డీటీ రవికుమార్ తెలిపారు.

News April 18, 2025

BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

image

AP: కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. హిందూపురానికి చెందిన నాగరాజు, నాగభూషణ్, మురళి, సోమలు యాద్గిర్(KA) జిల్లా షహర్‌పూర్‌కు బొలెరోలో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ట్రక్కును వీరి వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో వీరంతా అక్కడికక్కడే మృతిచెందారు.

News April 18, 2025

బంగ్లాదేశ్ నీతులు చెప్పడం మానాలి: విదేశాంగ శాఖ

image

భారత్‌కు నీతులు చెప్పడం మాని తమ దేశంలోని మైనారిటీలను కాపాడాలని బంగ్లాదేశ్‌కు విదేశాంగ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ స్పష్టంచేశారు. ఆ దేశంలో మైనార్టీలపై జరుగుతున్న దాడులను కప్పిపుచ్చడానికి భారత్‌ను బంగ్లాదేశ్ విమర్శిస్తోందని ఆరోపించారు. కాగా బెంగాల్‌‌‌లో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో ముగ్గురు మరణించారు. దీంతో భారత్‌లోని మైనారిటీ ముస్లింలను కాపాడాలని బంగ్లాదేశ్ వ్యాఖ్యానించింది.

error: Content is protected !!