News February 2, 2025
నంద్యాలలో పాత కక్షలతో వ్యక్తిపై కత్తితో దాడి

పాత కక్షల కారణంగా ఓ వ్యక్తిపై మరో వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటన నంద్యాలలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణ శివారు ప్రాంతంలోని నందమూరి నగర్‌కు చెందిన గౌస్‌కు రోజాకుంట వీధికి చెందిన హరికి మధ్య మనస్పర్థలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బస్టాండ్ వద్ద వీరిద్దరూ ఎదురుపడగా హరిపై గౌస్ కత్తితో దాడి చేశాడు. నంద్యాల వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 10, 2025
వికారాబాద్ జిల్లాలో తగ్గుతున్న భూగర్భ జలాలు

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఈ సంవత్సరంలో వర్షాలు తక్కువగా కురవడంతో వికారాబాద్ జిల్లాలో భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయని అధికారులు చెబుతున్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచిస్తున్నారు. నీటిని వృథా చేయొద్దని పేర్కొన్నారు.
News March 10, 2025
వ్యభిచారానికి అడ్డాగా ఎల్బీనగర్..!

ఎల్బీనగర్‌లోని పలు ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని పలువురు మండిపడుతున్నారు. కామినేని వద్ద లాడ్జీలు, హోటళ్లు వ్యభిచార కేంద్రాలకు అడ్డాగా మారాయని అధికారులు నిఘా కరవవ్వడంతో ఆడిందే ఆటగా మారిందంటున్నారు. ORR, ఆటోనగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, గుర్రంగూడా, DSNR హైవేలపై రాత్రుళ్లు కొందరు అసభ్యకర దుస్తులతో నిలబడి సైగలు చేస్తూ బాటసారులను ఇబ్బంది పెడుతున్నారు. వీటిని నివారించాలని కోరుతున్నారు.
News March 10, 2025
వ్యభిచారానికి అడ్డాగా ఎల్బీనగర్..!

ఎల్బీనగర్‌లోని పలు ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని పలువురు మండిపడుతున్నారు. కామినేని వద్ద లాడ్జీలు, హోటళ్లు వ్యభిచార కేంద్రాలకు అడ్డాగా మారాయని,అధికారులు నిఘా కరవవ్వడంతో ఆడిందే ఆటగా మారిందంటున్నారు. ORR, ఆటోనగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, గుర్రంగూడా, DSNR హైవేలపై రాత్రుళ్లు కొందరు అసభ్యకర దుస్తులతో నిలబడి సైగలు చేస్తూ బాటసారులను ఇబ్బంది పెడుతున్నారు. వీటిని నివారించాలని కోరుతున్నారు.