News July 24, 2024
నకిరేకల్: మంగళపల్లిలో విష జ్వరాల విజృంభన
నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామంలో మొత్తం 2,810 మంది ఉన్నారు. ప్రతి ఇంటిలో ఇద్దరు నుంచి ముగ్గురికి పైనే జ్వరాలు బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి జ్వరాల బారిన పడిన ప్రజలకు వైద్య పరీక్షలు చేస్తూ అవసరమైన వారికి మందులు అందజేశారు.
Similar News
News November 26, 2024
నల్గొండ: వియత్నాం అమ్మాయితో తెలుగు అబ్బాయి పెళ్లి
చండూరుకి చెందిన పాంపాటి భాస్కర్ శోభ దంపతుల మొదటి కుమారుడు ఉద్యోగరీత్యా 2017లో వియత్నం వెళ్లారు. అక్కడ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ.. అక్కడే హోటల్స్ స్థాపించి వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వంలో యూత్ మినిస్ట్రీ సెక్రటరీగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అమ్మాయి నీనా పరిచయం కావడం పరిచయం కాస్త ప్రేమగా మారి, పెళ్లి చేసుకున్నారు. చండూరులో వారి పెళ్లి జరిగింది.
News November 25, 2024
NLG: డిగ్రీ పరీక్ష వాయిదా
రేపు (మంగళవారం) జరగవలసిన డిగ్రీ పరీక్షను వాయిదా వేసినట్లు మహాత్మాగాంధీ యూనివర్సిటీ సీఓఈ డా.ఉపేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షను డిసెంబర్ 12న నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్ సందర్శించాలని కోరారు.
News November 25, 2024
పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. వణికిస్తున్న చలి!
నల్గొండ జిల్లాలో చలి పంజా విసురుతుంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గిపోతుండటంతో ప్రజలు చలిమంటలు కాచుకోక తప్పడం లేదు. గత రెండు మూడు రోజులుగా జిల్లాలో 19 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటు పలు ప్రాంతాల్లో పొగ మంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. చలి తీవ్రత కారణంగా వృద్ధులు, పిల్లలు తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.