News March 28, 2025
నగర అభివృద్ధిపై దృష్టి సారించాలి: KNR మున్సిపల్ ప్రత్యేక అధికారి

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ తో పాటు వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి పమేలా సత్పతి సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో గురువారం ఈ సమావేశం నిర్వహించారు. బడ్జెట్ ఆదాయ వ్యయాల అంచనా నివేదికలను కలెక్టర్ పరిశీలించారు. అధికారులు కరీంనగర్ నగర అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.
Similar News
News April 3, 2025
ఇల్లందకుంట: యువ కౌలు రైతు ఆత్మహత్య

వ్యవసాయంలో వచ్చిన నష్టాన్ని భరించలేక యువ కౌలు రైతు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇల్లందకుంట మండలం సిరిసేడులో జరిగింది. స్థానికుల వివరాలు.. వంగ మధు(28) గ్రామంలో మూడెకరాల భూమిని కౌలుకు తీసుకుని మొక్కజొన్న పంటను వేయగా.. రూ.2లక్షల వరకు నష్టం వచ్చింది. దీంతో మనస్తాపంతో ఆదివారం పురుగుమందు తాగి, వరంగల్ MGMలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందాడు.
News April 3, 2025
కరీంనగర్ జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలు…

కరీంనగర్ జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 36.6°C నమోదు కాగా, జమ్మికుంట 36.5, మానకొండూర్ 36.4, రామడుగు 36.2, వీణవంక 36.0, ఇల్లందకుంట 35.8, గన్నేరువరం 35.7, కరీంనగర్ 35.6, హుజూరాబాద్ 35.2, శంకరపట్నం, చిగురుమామిడి 35.1, చొప్పదండి 34.8, తిమ్మాపూర్ 34.5, కరీంనగర్ రూరల్ 34.0, కొత్తపల్లి 33.4, సైదాపూర్ 33.3°C గా నమోదైంది.
News April 3, 2025
కరీంనగర్: వరుస దొంగతనాలు.. జాగ్రత్త..!

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల వరుస దొంగతనాలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మార్చి 23 ఆదివారం అర్ధరాత్రి శంకరపట్నం మండలం లింగాపూర్‌లో ఏకంగా 6 ఇళ్లలో దొంగతనాలు జరిగిన విషయం తెలిసిందే. మార్చి 14న మానకొండూరు జడ్పీహెచ్‌ఎస్‌లో 23 ట్యాబ్‌లను గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనం చేశారు. వరుస దొంగతనాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు.