News April 29, 2024

నడికుడి వద్ద ఆర్టీసీ బస్సు.. బొలెరో ఢీ

image

మాచర్ల నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న బొలెరోను సోమవారం ఉదయం ఢీకొంది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనం పల్టీ కొడుతూ ముందుకు దూసుకెళ్లింది. ఆ సమయంతో బొలెరోలో డ్రైవర్‌తోపాటు మరో వ్యక్తి ఉండగా.. వారికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని 108లో గురజాల గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు.

Similar News

News January 2, 2025

గుంటూరు: కానిస్టేబుల్ అభ్యర్థుల పరుగు పోటీలలో 166 మంది అర్హత

image

పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు గుంటూరులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో పరుగు పోటీలు నిర్వహించారు. గురువారం నిర్వహించిన పోటీలలో 246 మంది అభ్యర్థులు హాజరవగా దేహదారుఢ్య, పరుగు పోటీలలో 166 మంది అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు. పోటీల నిర్వహణ తీరును జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలించారు. ఏఎస్పీలు సుప్రజ, హనుమంతరావు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

News January 2, 2025

తాడేపల్లి: అధికారంలోకి రాగానే సక్రమం అయిపోయిందా : YCP

image

సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే కరకట్టపై ఉన్న అక్రమ నివాసం సక్రమం అయిపోయిందా అని YCP తన ‘X’లో పోస్ట్ చేసింది. లింగమనేని రమేష్ నుంచి ఆ ఇంటిని అక్రమ మార్గాల్లో చంద్రబాబు తీసుకున్నారని.. కానీ అద్దె చెల్లిస్తున్నట్లు మొన్నటి వరకు ఆయన కుటుంబం బుకాయించిందని రాసుకొచ్చారు. కరకట్టపై ఆ ఇల్లు అక్రమ నిర్మాణమని గతంలో టీడీపీ నేత దేవినేని ఉమా ప్రకటించారని గుర్తు చేశారు.

News January 2, 2025

నగరంలో హత్య?

image

నగరం ఆక్స్ ఫర్డ్ స్కూల్ సమీపంలో సుమారు 60 ఏళ్ల వయసుగల పురుషుడు మృతదేహం లభ్యమైంది. సైడు కాలువ మట్టిలో కూరుకుపోవడం వల్ల మృతదేహం పురుగులు పట్టి ఉంది. మృతదేహం ఎవరన్నది గుర్తించాల్సి ఉంది. 4రోజుల క్రితం ఎవరో వ్యక్తిని చంపి ఇక్కడ పాతి పెట్టారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కుళ్లిపోయిన దశలో ఉందని, ఇది హత్యా లేక మరేదైనా కోణమా అని విచారణ చేస్తున్నామని ఎస్ఐ భార్గవ్ తెలిపారు.