News June 24, 2024

నరసన్నపేట: చోరీ కేసులో ఆరు నెలల జైలు శిక్ష

image

చోరీ కేసులో ఒకరికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ నరసన్నపేట సివిల్ జడ్జి సి.హరిప్రియ తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళితే.. 2019 నవంబర్ 6 తేదీన నరసన్నపేటలో విద్యుత్ శాఖ ఏఈ పల్లి బాలకృష్ణ ఇంట్లో మండలానికి చెందిన బమ్మిడి దేవకుమార్ బంగారం దొంగతనం చేశాడు. ఈ మేరకు నేరం రుజువు కావడంతో ఆరు నెలల జైలు శిక్ష ఆమె విధించారు. ఈ క్రమంలో ముద్దాయిని రిమాండ్‌కు తరలించారు.

Similar News

News October 6, 2024

అంపైర్‌గా సిక్కోలు వాసి

image

విజయవాడలో ఆలిండియా జూనియర్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్ పోటీలు ఈనెల 11వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పోటీలకు అంపైర్‌గా ఉద్దానం ప్రాంతానికి చెందిన తుంగాన శరత్‌కు అవకాశం వచ్చింది. ఈ మేరకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ నుంచి శరత్‌కు ఉత్తర్వులు అందాయి. ఆయనను పలువురు అభినందించారు.

News October 6, 2024

SKLM: నేటి నుంచి IIITకి సెలవులు

image

ఎచ్చెర్లలోని IIIT క్యాంపస్‌కు నేటి నుంచి ఈనెల 13వ తేదీ వరకు దసరా సెలవులు ఇచ్చినట్లు డైరెక్టర్ బాలాజీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 14వ తేదీ సోమవారం తరగతులు తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News October 6, 2024

‘బంగారువలస-వైజాగ్ బస్సును పునరుద్ధరించండి’

image

వంగర కేంద్రంలో బంగారువలస నుంచి వైజాగ్ వెళ్లే బస్సును పునరుద్దరించాలని ప్రయాణీకులు విజ్ఞప్తి చేశారు. గత 8 నెలలగా బంగారు వలస వైజాగ్ సర్వీస్‌లను నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం నుంచి బంగారువలస ద్వారా వంగర, రాజాం, విజయనగరం, మీదుగా ప్రయాణించే ఉద్యోగులు వ్యాపారస్తులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సును పునరుద్దరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.