News February 1, 2025
నరసరావుపేట: ప్రభుత్వ ఆసుపత్రికి పరికరాల కొనుగోళ్లకు ఒప్పందం

పల్నాడు జిల్లాలోని మాచర్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు 16 కీలక వైద్య పరికరాలను రూ.72.98 లక్షల నిధులతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. పవర్ గ్రిడ్ సాదరన్ ఇంటర్ కనెక్టర్ ట్రాన్స్‌మీషన్ సిస్టం లిమిటెడ్ ఈ నిధులను చేకూరుస్తుంది. ఈ మేరకు కలెక్టర్ పి. అరుణ్ బాబు సమక్షంలో పీఎస్ఎల్ ప్రతినిధులకు, జిల్లా అధికారులకు మధ్య ఎంఓయు జరిగింది. ఈ సంస్థ సహకారంతో వైద్య సేవలను గణనీయంగా మెరుగుపరచవచ్చన్నారు.
Similar News
News March 14, 2025
SRD: ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 26వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతాయని చెప్పారు. ఓపెన్ స్కూల్ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News March 14, 2025
రొయ్యల హరిప్రసాద్‌కు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు

రామాయంపేటకు చెందిన రొయ్యల హరిప్రసాద్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుకు ఎంపికయ్యారు. 1999 సంవత్సరం నుంచి ఉచితంగా తనకు తెలిసిన కరాటే విద్యను అందిస్తూ ఎన్నో అవార్డులు అందుకున్నాడు. హరి ప్రసాద్ సేవలను గుర్తించిన కరాటే ఫెడరేషన్ వారు లైఫ్ టైం అచీవ్మెంట్ బెస్ట్ కరాటే మాస్టర్ అవార్డుకు ఎంపిక చేశారు. ఈనెల 16న హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో హరిప్రసాద్ అవార్డు అందుకోనున్నారు.
News March 14, 2025
15 నుంచి ఒంటిపూట బడులు

వేసవి తీవ్రత దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ లోకల్ బాడీ పాఠశాలలకు ఈనెల 15 నుండి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాలలు నిర్వహించాలని ఆదేశించింది. జిల్లా విద్యాశాఖ అధికారులు మండల విద్యాశాఖ అధికారుల ద్వారా ఉత్తర్వులను, సమయ సరళిని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపిణీ చేయాలని ఆదేశించింది.