News March 17, 2025

నరసరావుపేట: రైలు కిందపడి గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య

image

నరసరావుపేట టిడ్కో గృహాల సమీపంలోని రైలు పట్టాల వద్ద డోన్ ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్ఐ శ్రీనివాసరావు నాయక్ తెలిపారు. ఎస్ఐ మాట్లాడుతూ.. మృతురాలు నీలం రంగు డిజైన్ చీర, నీలం రంగు జాకెట్టు ధరించినట్లు చెప్పారు. మృతురాలిని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు. వివరాలు తెలిసిన వారు స్థానిక రైల్వే పోలీసులను 9440438256 సంప్రదించాలన్నారు.

Similar News

News March 17, 2025

BREAKING: ఫలితాలు విడుదల

image

తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ మేరకు ప్రొవిజన్ సెలక్షన్ లిస్టును TGPSC విడుదల చేసింది. 574 మంది పోస్టులకు ఎంపికైనట్లు వివరించింది. 581 పోస్టులకు TGPSC పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. లక్షా 45 వేల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాశారు.

News March 17, 2025

REWIND: 1967వ నాటి ఆమదాలవలస రైల్వే స్టేషన్

image

ఆమదాలవలస పట్టణంలో శ్రీకాకుళం రోడ్డు పేరుతో ఉన్న రైల్వే స్టేషన్ జిల్లాలోని అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా ఉంది. అలాంటి రైల్వే స్టేషన్ 1967వ సంవత్సరంలో ఎలా ఉండేదో తెలిపే పాత ఫొటో వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్‌బుక్ అకౌంట్‌లలో ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు. అప్పటిలో ఆమదాలవలస పట్టణాన్ని ఆముదం పట్టణంగా పిలిచేవారని, అశోకుడి కాలంలో హేరందపల్లిగా పిలుచుకునే వారిని ప్రస్తుతం ఈ ఫొటో ద్వారా చర్చనీయాంశంగా మారింది. 

News March 17, 2025

ఉయ్యాలవాడ పేరు పెట్టాలని వినతి

image

ఓర్వకల్ విమానాశ్రయానికి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కోరారు. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉయ్యాలవాడ పేరు పెట్టాలంటూ వినతి పత్రాన్ని అందజేశారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు.

error: Content is protected !!