News January 8, 2025
నరసాపురం: అమ్మాయి ఆత్మహత్య కేసులో యువకుడి అరెస్టు
నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలోని ప్రగతి నగర్‌కు చెందిన సాయి లక్ష్మి కుమారి(19) ఈ నెల 4న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఎస్ఐ తెలిసిన వివరాలు ప్రకారం.. ఈ కేసులో గీతా చరణ్‌ను మంగళవారం యర్రంశెట్టివారిపాలెం పంచాయతీ పీతాని మెరకలో అరెస్టు చేశారు. వైద్య పరీక్షల అనంతరం నరసాపురం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు SI సురేష్ తెలిపారు.
Similar News
News January 9, 2025
కొవ్వూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కొవ్వూరు మండలం కాపవరం సమీపంలోని గోవర్ధనగిరి మెట్ట వద్ద గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. హైవే పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు గోపాలపురానికి చెందిన కె. వెంకటేశ్వరరావుగా గుర్తించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News January 9, 2025
ప.గో: జిల్లా మీదుగా నడిచే రెండు రైళ్లు రద్దు
విజయవాడ డివిజన్ పరిధిలోని సాంకేతిక మరమ్మతుల కారణంగా ఈ నెల 12న జిల్లా మీదుగా నడిచే రెండు రైళ్లను రద్దు చేస్తూ విజయవాడ డివిజనల్ రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. 12న గుంటూరు- వైజాగ్(17239), వైజాగ్- గుంటూరు(17240) రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు బుధవారం ప్రకటించారు. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.
News January 9, 2025
గోపాలపురం: ఐదుగురు డైరెక్టర్లు, ఇద్దరు డ్రైవర్లపై క్రిమినల్ కేసు నమోదు
గోపాలపురం(M) కొమటిగుంట రైస్ మిల్లులో బయటపడిన అక్రమ PDS బియ్యం ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సతీశ్ తెలిపారు. అధికారులకు రాబడిన సమాచారం మేరకు తనిఖీలు చేయగా మిల్లులో44 బస్తాల బియ్యం, లారీలో లోడ్ చేసున్న 580 బస్తాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. విలువ రూ.14,31,111 ఉంటుందన్నారు. ఐదుగురు మిల్లు డైరెక్టర్లు, ఇద్దరు డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, లారీని సీజ్ చేశామన్నారు.