News April 4, 2025
నరసాపురం: లేసు అల్లికదారులతో మాట్లాడిన కలెక్టర్

నరసాపురం మండలం రుస్తుంబాద లేసు పార్కును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా లేసు అల్లికదారులతో మాట్లాడుతూ నిత్య వినియోగం, బహుమతిగా ఇచ్చేందుకు అనుకూలంగా ఉన్న లేసు ఉత్పత్తులను తయారుచేసి మార్కెటింగ్ పెంచుకోవాలని సూచించారు. ప్రతి ఇంట్లోనూ లేసు అల్లికను తెచ్చి పెట్టుకునేలా నైపుణ్యతను చూపించాలని తెలిపారు.
Similar News
News April 11, 2025
తెలుగు మిస్ USA ఫైనల్కు ప.గో జిల్లా యువతి

వీరవాసరం మండలం రాయకుదురు శివారు నడపవారిపాలెంలో పుట్టిన కొత్తపల్లి చూర్ణం ప్రియ USA డల్లాస్లో నిర్వహించిన మిస్ తెలుగు
యుఎస్ఏ పోటీల్లో ఫైనల్కు చేరింది. 5 వేల మందిలో ఫైనల్ చేరటంతో గ్రామస్థులు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆమె USAలో MS చేస్తుంది. మే 25న ఫైనల్ పోటీలు జరుగుతాయన్నారు.
News April 11, 2025
దెందులూరు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

దెందులూరు మండలం కొమరేపల్లి హైవేపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నిడమర్రు గ్రామానికి చెందిన బాపన్న(55) పెద్ద కుమారుడికి ఈ నెల 18న వివాహం. బంధువైన గరిమెళ్ల అప్పారావుతో కలిసి పెళ్లిపత్రికలు ఇచ్చేందుకు బాపన్న బైక్పై వెళ్లారు. తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందారు. దీంతో రెండు కుటుంబాల్లో ఈ ప్రమాదం విషాదం నింపింది.
News April 11, 2025
తెలుగు మిస్ USA ఫైనల్ కు పగోజిల్లా మహిళ

వీరవాసరం మండలం రాయకుదురు శివారు నడపవారిపాలెంలో పుట్టిన కొత్తపల్లి చూర్ణం ప్రియ USA డల్లాస్ లో నిర్వహించిన మిస్ తెలుగు యు ఎస్ ఎ పోటిల్లో ఫైనల్ కు చేరింది. 5 వేల మందిలో ఫైనల్ చేరటంతో గ్రామస్థులు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆమె USAలో MS చేస్తుంది. మే 25 న ఫైనల్ పోటీలు జరుగుతాయన్నారు.