News February 3, 2025

నర్మల వాసికి జాతీయ నంది అవార్డు

image

గంభీరావుపేట మండలం నర్మల గ్రామానికి చెందిన ప్రముఖ కథ, నవల రచయిత గుండెల్లి నీలకంఠం జాతీయ నంది అవార్డు అందుకున్నారు. ఆదివారం విజయవాడలో తెలుగు వెలుగు సాహితీ వేదిక కాళోజీ తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారు అవార్డును ప్రదానం చేశారు. తెలుగు సాహిత్యంలో విశేషమైన సేవలు చేశారని ఆయనను అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

Similar News

News February 3, 2025

కోదాడ స్కూల్ నుంచి స్టూడెంట్స్ పరార్.. పట్టుకున్న పోలీసులు

image

కోదాడ మం. నెమలిపురి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు పారిపోవడం ప్రభుత్వ యంత్రాగాన్ని పరుగులు పెట్టించింది. ఎస్సై అనిల్ రెడ్డి వివరాలు.. పాఠశాల నుంచి ఆరుగురు విద్యార్థులు పారిపోగా ప్రిన్సిపల్ ఝాన్సీ PSలో ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వారిని విజయవాడలో ఉన్నట్లు గుర్తించారు. విద్యార్థులను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి కారణాలు అడిగి తెలుసుకున్నారు.

News February 3, 2025

ప్రభుత్వ స్కూళ్లలో తగ్గుతున్న అడ్మిషన్లు.. సర్కార్ కీలక నిర్ణయం

image

TG: ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సర్కార్ విద్యాసంస్థల్లో అందిస్తున్న సౌకర్యాలు, వస్తున్న ఫలితాల గురించి ప్రజలకు తెలిసేలా వివరించనుంది. అడ్మిషన్లు పెరిగేలా చర్యలు చేపట్టనుంది. దీనికోసం FB, X, WHATSAPP వంటి సోషల్ మీడియా వేదికల్లో స్పెషల్ గ్రూపులను క్రియేట్ చేయనుంది. వీటిని స్పెషల్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తారని సమాచారం.

News February 3, 2025

మాంచెస్టర్ అమ్మాయితో చిట్యాల అబ్బాయి పెళ్లి 

image

చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన రాజీవ్ రెడ్డి యూకేలోని మాంచెస్టర్ చెందిన యువతిని వివాహం చేసుకున్నారు. ఆయన మాంచెస్టర్లో హోటల్ మేనేజెమెంట్ కోర్సు పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే పోలీస్ శాఖలో పనిచేస్తున్న లారెన్ ఫిషర్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరూ పెద్దల సమక్షంలో హిందూ సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. పలువురు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.