News March 31, 2025

నర్వలో పేకాట రాయులు అరెస్ట్

image

నర్వ గ్రామ శివారులో పేకాడుతున్న ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ, కుర్మయ్య తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు సోమవారం గ్రామ శివారులో బోయపాటి నర్సింహులు పొలం దగ్గర రహస్యంగా పేకాడుతున్న ఆరుగురిని పట్టుకొని వారి దగ్గరి నుంచి రూ.1,080, నాలుగు సెల్‌ఫోన్‌లు, నాలుగు బైకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

Similar News

News April 3, 2025

గుంటూరు జిల్లాలో బార్లకు ఈ-వేలం

image

రాష్ట్రంలో లైసెన్సు ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, బిడ్ అమౌంట్ చెల్లించని బార్లను ఈ-వేలం ద్వారా ఔత్సాహికులకు కేటాయించేందుకు అబ్కారీ శాఖ నిర్ణయించింది. జనాభా ప్రాతిపదికన రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు నిర్ణయించారు. ఏప్రిల్ 9న అత్యధిక బిడ్‌దారులకు లైసెన్సులు కేటాయించనున్నారు. అందులో గుంటూరు జిల్లాలో తెనాలి మునిసిపాలిటీకి-5, పొన్నూరు-2, మంగళగిరి-తాడేపల్లికి-1 కేటాయించారు.

News April 3, 2025

సంచలనం.. 25000 టీచర్ల పోస్టులు రద్దు

image

పశ్చిమ బెంగాల్‌లో టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. 2016లో జరిగిన 25 వేల టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాలను 2024లో కలకత్తా హైకోర్టు రద్దు చేయగా.. ఆ తీర్పును SC సమర్థించింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు సరైన కారణాలు లేవంది. 3 నెలల్లో కొత్త నియామకాలు చేపట్టాలని ఆదేశించింది. కాగా, ఈ నియామకాల్లో అక్రమాలు జరిగాయని కొందరు కోర్టును ఆశ్రయించారు.

News April 3, 2025

విజయవాడ: మహిళ హత్య.. నిందితుడి అరెస్ట్

image

పటమటలో మంగళవారం రాత్రి జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పటమట పోలీసుల వివరాల ప్రకారం.. లక్ష్మి అనే మహిళ తన భర్తతో కలిసి కాగితాలు ఏరుకొని జీవనం సాగించేది. వాంబే కాలనీకి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి లక్ష్మిని శారీరకంగా కలవాలని బలవంతం చేశాడు. ఒప్పుకోకపోవడంతో మంగళవారం రాత్రి మద్యం తాగి విచక్షణారహితంగా అత్యాచారం చేసి హత్య చేసినట్లు తెలిపారు. 

error: Content is protected !!