News February 18, 2025

నర్సంపేట: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

నర్సంపేట -పాకాల మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగి యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. అశోక్ నగర్‌కు చెందిన వెంకటేశ్ నర్సంపేటలో షాపులో పని చేస్తుండేవాడు. సోమవారం రాత్రి పని ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళుతున్న క్రమంలో ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 13, 2025

సారా తయారీపై డ్రోన్లతో నిఘా: కలెక్టర్

image

జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో నాటు సారా తయారీపై నిఘా కోసం డ్రోన్లు వినియోగించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. నాటుసారా తయారీ, రవాణా, వినియోగాన్ని సంపూర్ణంగా నిర్మూలించేందుకు కృషి చేయాలన్నారు. నవోదయం 2.0 కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నాటుసారా తయారీతోపాటు నాటుసారా వినియోగం వల్ల వచ్చే నష్టాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

News March 13, 2025

రేపు సెలవు.. ఎల్లుండి నుంచి ఒంటిపూట బడులు

image

తెలుగు రాష్ట్రాల్లో ‘హోళీ’ సందర్భంగా రేపు విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. ఎల్లుండి నుంచి విద్యార్థులకు ఒంటి పూట బడులు మొదలు కానున్నాయి. ఏపీ, తెలంగాణలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు కొనసాగుతాయి. పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సా.5 గంటల వరకు నిర్వహిస్తారు. ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు ఉంటాయి. ఆ తర్వాత వేసవి సెలవులు ప్రకటించనున్నారు.

News March 13, 2025

శ్రీ సత్యసాయి జిల్లా: అగ్ని వీర్‌కు దరఖాస్తు చేసుకోండి

image

అగ్ని వీర్ నియామకం కోసం దరఖాస్తులు చేసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టి.ఎస్. చేతన్ పేర్కొన్నారు. వివిధ కేటగిరీల అగ్ని వీర్ నియామకం కోసం ఏప్రిల్ 10వ తేదీ లోపు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష మొట్టమొదటిసారిగా తెలుగుతోపాటు 13 వేర్వేరు భాషల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

error: Content is protected !!