News April 24, 2024

నల్గొండ: 20ఏళ్ల తర్వాత ఎండిన మైల సముద్రం 

image

నల్గొండ జిల్లా కనగల్ మండలంలో వర్షాభావ పరిస్థితుల తోడు ఏఎమ్మార్పీ నీటిని చెరువుల్లోకి విడుదల చేయకపోవడంతో రెండు దశాబ్దాల తరువాత మొదటి సారిగా కనగల్‌ మైల సముద్రం చెరువు ఎండింది. ఈ చెరువు కింద దాదాపు 1,600 ఎకరాలకు పైగా సాగవుతోంది. 0.750 టీఎంసీల సామర్థ్యం కలిగిన మైల సముద్రం చెరువును నిజాం నవాబులు నిర్మించారు. చెరువు ఎండిపోవడంతో దీనిపై ఆధారపడ్డ 15 గ్రామాలకు పైగా భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం పడింది.

Similar News

News December 25, 2024

భువనగిరి: అంగన్‌వాడీ టీచర్ల సస్పెండ్ 

image

చిన్నారులకు ఇవ్వాల్సిన బాలామృతాన్ని పక్కదారి పట్టించారని విచారణలో తేలడంతో BNGR కలెక్టర్ హనుమంతరావు అంగన్‌వాడీ టీచర్లను సస్పెండ్ చేశారు. వారి వివరాలిలా.. భువనగిరిలో ఓ పశువుల పాకలో బాలామృతం లభ్యమవ్వగా అధికారులు విచారణ జరిపి కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. గుట్ట కేంద్రం 3, మంతపురి, పుట్టగూడెం, మోత్కూర్‌ 7వ కేంద్రం అంగన్‌వాడీ టీచర్లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు. 

News December 25, 2024

క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి

image

రేపు క్రిస్మస్ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచానికి ప్రేమ, సేవా, కరుణ, త్యాగం, క్షమాగుణం వంటి అద్భుతమైన జీవన మార్గాలను అందించిన జీసస్ స్పూర్తిని కొనసాగించేందుకు మనమంతా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించుకుందామని మంత్రి పిలిపునిచ్చారు. ఏసుక్రీస్తు దయతో తెలంగాణలో ప్రజలంతా పాడిపంటలు, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు.

News December 24, 2024

NLG: గ్రామీణ మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ

image

నల్గొండ SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ రాంనగర్ (RSETI)లో పదో తరగతి చదువుకున్న గ్రామీణ నిరుద్యోగ మహిళలకు 30 రోజుల ఉచిత కుట్టు శిక్షణ అందజేస్తున్నామని సంస్థ డైరెక్టర్ రఘుపతి తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం ఉంటుందన్నారు. ఉమ్మడి నల్గొండకు చెందిన 19 నుంచి 45 ఏళ్ల లోపు వారు అర్హులని తెలిపారు. డిసెంబర్ 30 లోపు సంస్థ ఆఫీసులో సంప్రదించాలని సూచించారు.