News February 26, 2025

నల్గొండ: 3 లక్షల మంది ఎదురుచూపు!

image

నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం దశలవారీగా 2,76 ,694 మంది రైతులకు రైతు భరోసా నిధులు జమ చేసింది. 3 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా అందించింది. రైతు భరోసాను ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని రైతులంటున్నారు. ఎన్ని ఎకరాల వరకు అందిస్తుందో ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో మరో 3 లక్షల మంది రైతులు ఆందోళన చెందుతున్నారు.

Similar News

News February 26, 2025

నల్గొండ: పోలింగ్ సెంటర్లకు తరలిన సిబ్బంది

image

వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ నిర్వహణకు పోలింగ్ సిబ్బంది నల్గొండ నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలారు. బుధవారం నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎన్నికల సామాగ్రిని అధికారులు పోలింగ్ సిబ్బందికి డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఎన్నికల సామాగ్రితో సిబ్బంది ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రూట్ బస్సులలో బయలుదేరారు.

News February 26, 2025

నల్గొండ: గుండెపోటుతో వ్యక్తి మృతి

image

చండూరు మండలం నెర్మటలో పండుగ పూట తీవ్ర విషాదం జరిగింది. గుండెపోటుతో దోటి లింగయ్య (45) అనే వ్యక్తి మృతిచెందాడు. ఉదయం పొలం దగ్గరకు వెళ్లొచ్చాడని అంతలోనే ఛాతిలో నొప్పు వస్తుందని కుప్పకూలాడని గ్రామస్థులు తెలిపారు. లింగయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

News February 26, 2025

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దు: డీఎంహెచ్వో

image

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని డీఎంహెచ్ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. NLG డీఎంహెచ్ఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నిషియన్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రోజూ పీహెచ్సీలకు వచ్చే రోగుల రక్తనమూనాలు సేకరించి తెలంగాణ హబ్‌కు పంపాలన్నారు.

error: Content is protected !!