News February 25, 2025
నల్గొండ: ఇంటర్, పది పరీక్షల నిర్వహణపై సమీక్ష

మార్చిలో జరగనున్న ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ జే.శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన తన చాంబర్లో ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. మార్చి 5 నుంచి మార్చి 25 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు ,మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని ఆయన తెలిపారు.
Similar News
News February 25, 2025
NLG: ఎత్తుకు పైఎత్తులు.. మిగిలింది ఒక్కరోజే!

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ప్రచారానికి ఒక్క రోజే మిగిలి ఉండటంతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక కొంతమంది తాయిలాలు పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా కొంతమంది అభ్యర్థులు రెండో ప్రాధాన్యత ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.
News February 25, 2025
NLG: క్విజ్.. వీటికి సమాధానాలు తెలుసా?

☞ఎవరికాలంలో నల్గొండ నీలగిరిగా ప్రసిద్ధి చెందింది?
☞భూదానోద్యమాన్ని ఎవరు ప్రారంభించారు?
☞దేశోద్ధారక గ్రంథమాలను ఎవరు స్థాపించారు?
☞రావి నారాయణరెడ్డి జన్మస్థలం?
☞‘పల్లెటూరి పిల్లగాడ’ పాటను ఎవరు రచించారు?
★పై ప్రశ్నలకు సమాధానాలను కామెంట్ చేయగలరు?
నోట్: మధ్యాహ్నం 2 గంటలకు ఇదే ఆర్టికల్‌లో జవాబులను చూడోచ్చు.
SHARE IT..
News February 24, 2025
నల్గొండ జిల్లా టాప్ న్యూస్

☞ ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న మంత్రులు ☞ మున్నూరు కాపులు కూడా రెడ్లే: విశారదన్ మహరాజ్ ☞ NLG కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ డే ☞ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల నిరసన ☞ జోరుగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ☞ మహాశివరాత్రికి ముస్తాబవుతున్న శివాలయాలు ☞ యుజీసీ నెట్ సాధించిన ఎంజీయూ విద్యార్థులు