News March 5, 2025
నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బాలుడు అదృశ్యం

నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి గొల్లగూడలో మూడేళ్ల బాలుడు అదృశ్యమైనట్లు పట్టణ టూ టౌన్ ఎస్ఐ నాగరాజు తెలిపారు. పట్టణ ఆయన తెలిపిన వివరాలు.. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి గొల్లగూడలో మూడేళ్ల బాలుడు అబ్దుల్ అహ్మద్ (అబ్బు) ఆడుకుంటూ తప్పిపోయాడని తెలిపారు. బాబు ఆచూకీ తెలిసినవారు సెల్ నం.8712670171, 8712667671లకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ నాగరాజు పేర్కొన్నారు
Similar News
News March 6, 2025
NLG: విచారణలో తేలితే.. సర్వీస్ బ్రేకే!

నల్గొండ జిల్లాలో పంచాయతీ కార్యదర్శులకు మరోసారి ఛార్జ్ మెమోలు అందజేయడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో పలువురు పంచాయతీ కార్యదర్శులు ఆ శాఖకు చెందిన జిల్లా అధికారి అనుమతి లేకుండా సెలవుపై వెళ్లారు. గతంలోనే 109 మందికి నోటీసులు జారీ చేసిన పంచాయతీ అధికారి తాజాగా 134 మందికి ఛార్జి మెమోలు అందజేశారు. ఎలాంటి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనట్లు విచారణలో తేలితే.. వారి సర్వీస్ బ్రేక్ చేయనున్నారు.
News March 6, 2025
BREAKING: నాంపల్లిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

నాంపల్లి మండల కేంద్రానికి చెందిన వ్యక్తి బుధవారం రాత్రి వడ్డేపల్లి రోడ్డు ప్రమాదం జరిగింది. వట్టిపల్లి వద్ద బత్తాయి తోటలో పనులు ముగించుకుని తన భార్యతో కలిసి వస్తుండగా నాంపల్లి మండలం వడ్డేపల్లి మూలమలుపు వద్ద ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. నాంపల్లికి చెందిన పూల సత్తయ్య, సత్తమ్మ కుమారుడు రవిగా గుర్తించినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 5, 2025
NLG: ‘సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి’

సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సైబర్ క్రైమ్ డిఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు. సైబర్ జాకృత్క దివాస్ సందర్భంగా నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాలు పని రకాలు ఉంటాయని, వాటిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు.