News March 12, 2025

నల్గొండ జిల్లాలో పలువురు సీఐలు బదిలీలు

image

నల్గొండ జిల్లాలో పలువురు సీఐలు బదిలీ అయ్యారు. చండూరు, నాంపల్లి సర్కిల్ పరిధిలోని సీఐలను హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి బదిలీ చేశారు. మహబూబ్‌నగర్ మల్టీ జోన్ పరిధిలో వెయిటింగ్‌లో ఉన్న కె.ఆదిరెడ్డిని నాంపల్లి సీఐగా బదిలీ చేశారు. నల్గొండ ట్రాఫిక్ సీఐగా పని చేస్తున్న రాజుకు చండూరు సీఐగా పోస్టింగ్ ఇచ్చారు. నల్గొండ ఎస్బీ సీఐ శివ శంకర్‌ను కోదాడ టౌన్ సీఐగా బదిలీ చేశారు.

Similar News

News December 15, 2025

పెద్దవూర: మూడు ఓట్లతో ఇండిపెండెంట్ విజయం

image

పెద్దవూర మండలం సంగారం గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఇండిపెంటెండ్ ఈసం రమేష్ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ బలపరిచిన మాతంగి శ్రీనయ్య మీద 3 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తన మీద నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామ అభివృద్ధితో పాటు గ్రామానికి సేవ చేస్తా అని అన్నారు.

News December 14, 2025

త్రిపురారం: రాష్ట్రంలోనే చిన్న పంచాయతీ.. ఎవరు గెలిచారంటే..

image

బృందావనపురం సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన మందడి రమణారెడ్డి విజయం సాధించారు. తన ప్రత్యర్థి, బీఆర్ఎస్ బలపరిచిన వంగాల శ్రీనివాస్ రెడ్డిపై ఏడు ఓట్ల తేడాతో రమణారెడ్డి విజయం సాధించారు. రమణారెడ్డి విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులు, మద్దతుదారులు సంబరాలు జరుపుకుంటున్నారు. బృందావనపురం గ్రామపంచాయతీ రాష్ట్రంలోనే అతి చిన్న గ్రామపంచాయతీ కావడం విశేషం. ఇక్కడ కేవలం 98 ఓట్లు మాత్రమే ఉన్నాయి.

News December 14, 2025

నల్గొండ జిల్లాలో తొలి ఫలితం

image

నిడమనూరు మండలం వెంగన్నగూడెం గ్రామపంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి సలాది నాగమణి నాగరాజు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ బలపరిచిన కొండారి నాగజ్యోతి చంద్రశేఖర్ మీద 87 ఓట్ల తేడాతో వారు విజయం సాధించారు. తమ మీద నమ్మకంతో గెలిపించిన ప్రజలకు వారు ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ అభివృద్ధికి పాటుపడతామని నాగమణి తెలిపారు.