News April 15, 2025

నల్గొండ: టుడే టాప్ న్యూస్

image

* నకిరేకల్ వీటీ కాలనీలో అగ్నిప్రమాదం * దళిత యువతి చావుకు కారణమైన వ్యక్తిని అరెస్టు చేయాలని బొక్కముంతల పహాడ్‌లో బంధువుల ఆందోళన * యాసంగి పంటలపై ప్రకృతి పంజా * చందంపేటలో కుక్కల దాడిలో 12 గొర్రెలు మృతి * రిటైర్డ్ హోంగార్డుకు ఎస్పీ శరత్ చంద్ర పవార్ సన్మానం * పైన టూల్ బార్‌లో లోకేషన్ మీద, తర్వాత ‘వి’ సింబల్ క్లిక్ చేసి మన గ్రామ/మండల/నియోజకవర్గ/జిల్లా వార్తలను 5 నిమిషాల్లో తెలుసుకోండి.

Similar News

News April 17, 2025

ఈ నెల 19న నల్గొండలో ప్రత్యేక ప్రజావాణి

image

ఈ నెల 19న నల్గొండ కలెక్టరేట్‌లో వయో వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని వయోవృద్ధులు, దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News April 16, 2025

నల్గొండలో యువతి సూసైడ్

image

యువతి సూసైడ్ చేసుకున్న ఘటన నల్గొండలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మాన్యచెల్కకు చెందిన మాధురి (26) బిటెక్ పూర్తి చేసి ఓ ప్రవేట్ ఉద్యోగం చేస్తోంది. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 16, 2025

NLG: హత్యాయత్నం కేసులో ఒకరికి జైలు శిక్ష

image

గిరిజన మహిళపై హత్యాయత్నం చేసిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ NLG SC, ST కోర్టు జడ్జి రోజారమణి బుధవారం తీర్పునిచ్చారు. 2018 అక్టోబర్ 13న రాత్రి నాంపల్లిలోని దామెరకు చెందిన ఓ మహిళను అదే గ్రామానికి చెందిన మహేశ్ పత్తి చేలోకి తీసుకెళ్లి ఆమెపై యాసిడ్ పోసి హత్యాయత్నం చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా జడ్జి జైలు శిక్ష విధించారు.

error: Content is protected !!