News April 10, 2025
నల్గొండ: డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

నల్గొండ జిల్లాలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 11,15,16 తేదీలలో జరుగబోయే పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. మిగతా పరీక్షలు యధావిధిగా టైం టేబుల్ ప్రకారం జరుగుతాయన్నారు.
Similar News
News December 14, 2025
కాంగ్రెస్, BRS సర్పంచులు BJPలో చేరాలి: బండి సంజయ్

TG: కాంగ్రెస్, BRS సర్పంచులు BJPలో చేరితే ఆయా గ్రామాల అభివృద్ధికి సహకరిస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈనెల 18లోపు చేరాలని, ఆ తర్వాత చేర్చుకోబోమని చెప్పారు. ‘INC, BRS సర్పంచులు అసూయ పడేలా BJP సర్పంచుల గ్రామాలను అభివృద్ధి చేస్తా. తట్టెడు మట్టి కూడా ఎత్తిపోసేందుకు పైసలు లేని పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో సర్పంచులపై తీవ్ర ఒత్తిళ్లు వచ్చే అవకాశముంది’ అని BJP సర్పంచుల భేటీలో వ్యాఖ్యానించారు.
News December 14, 2025
నేడు జనగామ జిల్లాలో 79 గ్రామ పంచాయతీలకు పోలింగ్

జనగామ జిల్లా పరిధిలో నేడు రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 79 గ్రామ పంచాయతీలు, 710 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. జిల్లాలో 1,10,120 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జనగామ, నర్మేట, తరిగొప్పుల, బచ్చన్నపేట మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
News December 14, 2025
కర్నూలు: వేట కొడవలితో నరికి హత్య.. నిందితుడి అరెస్ట్

గుంతకల్లులో పదేపదే అవమానిస్తున్నాడనే కోపంతో కురువ అట్టెల శివకుమార్ తన పొరుగు వ్యక్తి చంద్రశేఖర్(35)ను <<18541611>>హత్య<<>> చేశాడు. గతంలో తలుపు కొట్టిన విషయాన్ని చంద్రశేఖర్ తరచూ అవమానించేలా ప్రస్తావించేవాడు. డిసెంబర్ 12న జరిగిన వాగ్వాదంలో ఆగ్రహించిన శివకుమార్ వేట కొడవలితో దాడి చేయగా.. చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు శివకుమార్‌ను 2టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


