News March 13, 2025
నల్గొండ: పోలీస్ అంటేనే ఒత్తిడితో చేసే ఉద్యోగం: కలెక్టర్

పోలీస్ ఉద్యోగం అంటే ఒత్తిడితో చేసే ఉద్యోగమని, శారీరక స్ఫూర్తితో పాటు అలర్ట్ కావడానికి క్రీడలు మానసికంగా ఉపయోగపడుతాయని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్లగొండ జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసులకు ఏర్పాటు చేసిన పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2025కు గురువారం ఉదయం ఆమె ముఖ్యఅతిథిగా హాజరై, ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.
Similar News
News March 14, 2025
మఠంపల్లి: ఘనంగా హోలీ సంబరాలు

మఠంపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో హోలీ సంబరాలు శుక్రవారం అంబారాన్నంటాయి. ఈ మేరకు ఉదయం నుంచే యువతీ యువకులు, మహిళలు, చిన్నారులు రంగులు పూసుకుంటూ ఒకరిపై ఒకరు రంగు నీళ్లు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం హోలీ.. హోలీ.. హోలీ అంటూ నినాదాలు చేస్తూ సంతోషంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు.
News March 14, 2025
మిర్యాలగూడ: రోడ్డు ప్రమాదం.. వృద్ధుడి మృతి

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్‌లో జరిగింది. ఎస్ఐ వివరాలు.. నేరేడుచర్ల మండలం బక్కయ్యగూడెంకి చెందిన సైదులు(60) శ్రీనివాసనగర్‌లో జరుగుతున్న బంధువుల పెళ్లికి వచ్చాడు. తిరుగు ప్రయాణంలో కోదాడ- జడ్చర్ల రాహదారిని దాడుతున్నాడు. ఈ క్రమంలో అతణ్ని బైక్ ఢీకొంది. మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి నుంచి నల్గొండ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
News March 14, 2025
నల్గొండ: ఈనెల 17, 18 తేదీల్లో కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల వంటా వార్పు

రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈనెల 17, 18 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు కలెక్టరేట్ ఎదుట వంట వార్పు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సిఐటీయూ జిల్లా నాయకులు అవుటు రవీందర్ తెలిపారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమస్యలతో కూడుకున్న మెమోరాండం నల్గొండ జిల్లా కార్యాలయంలో సమర్పించారు.