News March 22, 2025

నల్గొండ: మద్యం మత్తులో మందుబాబు హల్చల్ 

image

గుర్రంపోడులో మద్యం మత్తులో మందుబాబు వీరంగం సృష్టించాడు. సుమారు అరగంట పాటు నల్గొండ – దేవరకొండ రహదారిపై అడ్డంగా పడుకున్నాడు. స్థానికులు అతడిని అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లడంతో ట్రాఫిక్ ఇబ్బంది తప్పింది. పోలీసులు ఘటనా స్థలం వద్దకు వచ్చినా మందుబాబు మత్తులో ఉండడంతో వెళ్లిపోయారు. అతను మరోసారి వచ్చి రచ్చ చేయగా అక్కడి నుంచి తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. 

Similar News

News March 25, 2025

నల్గొండ: మరొకరికి మంత్రి పదవి!

image

మంత్రివర్గ విస్తరణలో భాగంగా రాజగోపాల్ రెడ్డికి చోటు కల్పిస్తారన్న చర్చ నడుస్తోంది. ఇటీవల అద్దంకి దయాకర్‌ను MLC పదవి వరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే SRPTకి చెందిన రమేశ్ రెడ్డిని పర్యాటక శాఖ ఛైర్మన్‌గా నియమించింది. కాగా ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే మంత్రులుగా ఉత్తమ్, కోమటిరెడ్డి ఉన్నారు. దీంతో ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా ప్రాతినిధ్యం పెరిగినట్లైంది. జిల్లాకు మరో అమాత్య యోగముందా కామెంట్ చేయండి.

News March 25, 2025

ఉమ్మడి NLG జిల్లా నుంచే సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం

image

రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీకి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే శ్రీకారం చుట్టనున్నారు. ఉగాది పర్వదినాన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హుజూర్ నగర్‌లో రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సభ ఏర్పాట్ల పనులు చకచకా జరుగుతున్నాయి. ఫణిగిరి గుట్టకు వెళ్లే రోడ్డులో సీఎం సభ ప్రాంగణం ఏర్పాటు చేయనున్నారు.

News March 25, 2025

NLG: ఉద్యమాల జిల్లాలో ‘పోరుబాట’

image

ఉమ్మడి జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటి సాగుకు నీరు అందడం లేదు. దీంతో పంటలు ఎండిపోతున్నాయి. ఎండిన పంట చేలలో రైతులు పశువులను మేపుతున్నారు. దీంతో ఇటు BJP, BRS, CPM పార్టీలు ఉద్యమ బాట పట్టారు. ఎండుతున్న పంటల విషయంపై అధికార పార్టీ సైలెంట్‌గా ఉండగా.. ప్రతిపక్ష పార్టీలు మాత్రం పోరుబాట కొనసాగిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎండిన పొలాలను పరిశీలిస్తూ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

error: Content is protected !!