News April 1, 2024
నల్గొండ: రూ.3లక్షల నగదు పట్టివేత

పెద్దవూర మండలంలో కొండమల్లేపల్లి వైపు నుంచి వచ్చిన వాహనాలను పోలీసులు తనిఖీలు చేశారు. తనిఖీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాకు చెందిన తాతారావు రూ.1.50 లక్షలు, కృష్ణ జిల్లాకు చెందిన ఎర్రగడ్డ నవీన్ రూ.50వేలు, అనకాపల్లి జిల్లాకు చెందిన కొండల దుర్గారావు రూ.1లక్షల నగదుకు ఎలాంటి పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు ఎస్సై వీరబాబు తెలిపారు.
Similar News
News April 24, 2025
నల్గొండ జిల్లాలో సుర్రుమంటున్న ‘సూరన్న’

నల్గొండ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. రోహిణీ కార్తెలో రోళ్లు పగులుతాయి అనే నాణుడిని నిజం చేస్తూ రోహిణీకి ముందే సూరన్న సుర్రుమంటున్నాడు. బుధవారం కట్టంగూర్‌లో ఏకంగా రికార్డు స్థాయిలో 45.3 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మాడ్గులపల్లి 45.2, నిమనూరు 44.9, త్రిపురారం 44.8, నార్కట్‌పల్లి 44.6, అనుముల 44.6, వేములపల్లి 44.6, దామరిచర్ల 44.4, తిప్పర్తిలో కనిష్ఠంగా 44.1 డిగ్రీలు నమోదయ్యాయి.
News April 24, 2025
కాంగ్రెస్ నేతల్లో గగుర్పాటు: జగదీశ్ రెడ్డి

బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ కాంగ్రెస్ నేతల్లో గగుర్పాటు కలిగిస్తోందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ‘ఇది బీఆర్‌ఎస్ సభనా, లేక టీఆర్‌ఎస్ సభనా అంటూ కాంగ్రెస్ నాయకులు ఆగమాగం అయితుండ్రు. సభకు కేసీఆర్ వస్తుండే. ఆల్‌రెడీ బీఆర్‌ఎస్ పేర ఎన్నికల్లో పోటీనే చేసినం. మీకెందుకు అనుమానం. ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు ప్రజలతోపాటు రైతులు లక్ష మంది తరలిరానున్నారు’ అని పేర్కొన్నారు.
News April 24, 2025
NLG: ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరిపేందుకు చర్యలు

అందరూ సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా జరిగేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్గొండ మండలం గుట్టకింది అన్నారంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిల్లర్లతో ఫోన్‌లో మాట్లాడి కొనుగోలు వేగవంతంగా జరిగేందుకు చర్యలు తీసుకున్నారు. రైతులు కూడా కేంద్రం సిబ్బందికి సహకరించాలని సూచించారు.