News April 19, 2025
నల్గొండ: రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దు: DRO

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని నల్గొండ ఇన్‌ఛార్జ్ డీఆర్ఓ వై.అశోక్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్గొండ మండల కేంద్రంలోని కంచనపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కాంటా వేయాలన్నారు. మిల్లులకు పంపించే ధాన్యం వివరాలను కొనుగోలు కేంద్రం ఇన్‌ఛార్జ్ బట్టు నవీన్‌ను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News April 20, 2025
కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు

కార్పొరేట్ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని నల్గొండ సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకుడు ప్రేమ్ కరణ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నత ప్రమాణాలతో బోధన సాగిస్తూ కాంపిటిటీవ్ పరీక్షల్లో ఎక్కువ సంఖ్యలో ఉత్తీర్ణత సాధిస్తున్న కళాశాలలకు ఆన్‌లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
News April 20, 2025
రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన

జిల్లాలో రాజీవ్ వికాసం దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుంది. ఈ పథకానికి జిల్లా వ్యాప్తంగా 79,052 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే ఈ దరఖాస్తులను మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో అధికారులు పరిశీలిస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్‌కు 21,120, ఎస్టీ కార్పొరేషన్‌కు 11,515, బీసీ కార్పొరేషన్‌కు 39,274, ఈ బీసీ 1,994, మైనార్టీకి 4,926, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్‌కు 253 దరఖాస్తులు వచ్చాయి.
News April 20, 2025
ఒకే కాన్పులో ముగ్గురు జననం

సూర్యాపేట మండల పరిధిలోని రాయినిగూడెంకి చెందిన షేక్ షబానాకు మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. సూర్యాపేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో సంతానం కోసం చికిత్స పొంది గర్భం దాల్చారు. ఆమెకు బీపీ, షుగర్, థైరాయిడ్ ఉండటంతో ఆసుపత్రి యజమాన్యం హైరిస్క్ ప్రెగ్నెన్సీగా అడ్మిట్ చేసుకొని సిజేరియన్ చేశారు. ఒకే కాన్పులో ఇద్దరు మగ శిశువులు, ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చారు.