News March 4, 2025
నల్గొండ: శ్రీపాల్ రెడ్డికి 13,969 ఓట్లు

వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. పీఆర్టియూ టీఎస్ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డితో పోటీపడి 13,969 ఓట్లు సాధించారు. ఎలిమినేషన్ ప్రక్రియ ఆసాంతం ఎంతో ఉత్కంఠగా కొనసాగింది. చివరకు మూడో స్థానంలో ఉన్న హర్షవర్ధన్ రెడ్డి ఎలిమినేషన్‌తోనే శ్రీపాల్ రెడ్డి గెలుపు ఖరారైంది.
Similar News
News March 4, 2025
చందంపేట: కారు ఢీకొని వ్యక్తి మృతి

కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన చందంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన సమాచారం.. మానవత్ తండాకు చెందిన రమావత్ పాండు, ఆయన ఇద్దరు భార్యలు ద్విచక్ర వాహనంపై వస్తుండగా బిల్డింగ్ తండా సమీపంలో ఇన్నోవా కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పాండు మృతి చెందగా.. భార్యలు కౌసల్య, చాందిలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News March 4, 2025
ఇంటర్ విద్యార్థులకు డీఐఈఓ కీలక సూచన

నల్గొండ జిల్లాలో ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు డీఐఈఓ దస్రు నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఎండ తీవ్రత పెరుగుతున్నందున విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా కాపీయింగ్‌కు పాల్పడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News March 4, 2025
NLG: టీచర్ MLC ఎన్నికలు.. ‘ఏక్’ నిరంజన్!

NLG – KMM – WGL టీచర్ MLC ఎన్నికల ఫలితాల్లో ఓ అభ్యర్థి ఒకటే ఓటు వచ్చింది. ఈ ఎన్నికల్లో మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీ చేయగా అందులో బంకా రాజు-7, కంటె సాయన్న-5, చలిక చంద్రశేకర్-1 సింగిల్ డిజిట్ ఓట్లకే పరిమితమయ్యారు. కాగా.. మరో ఆరుగురు తాటికొండ వెంకటయ్య-39, జంగిటి కైలాసం-26, పన్నాల గోపాల్‌రెడ్డి-24, అర్వ స్వాతి-20, లింగిడివెంకటేశ్వర్లు-15, పురుషోత్తంరెడ్డి-11 డబుల్ డిజిట్ ఓట్లతో సరిపెట్టుకున్నారు.