News March 9, 2025

నల్గొండ: సీపీఐకి ఒక ఎమ్మెల్సీ స్థానం

image

కాంగ్రెస్ అధిష్ఠానం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది. అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, కెతావత్ శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ప్రకటిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. వీరి ఎంపిక పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కాగా ఒక ఎమ్మెల్సీ సీటును కాంగ్రెస్ సీపీఐకి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఎమ్మెల్సీ పేరును సీపీఐ ప్రకటించాల్సి ఉంది.

Similar News

News March 10, 2025

మిర్యాలగూడ: ప్రణయ్ MURDER.. అసలేం జరిగింది?

image

> టెన్త్ నుంచి ప్రణయ్, అమృత ఫ్రెండ్స్
> 2018 JANలో HYDలో వారి ప్రేమ పెళ్లి
> విషయం తెలిసి 2కుటుంబాల్లో గొడవలు.. PSలో ఫిర్యాదు
> 2018 SEP 14న కులాంతర వివాహం తట్టుకోలేక ప్రణయ్‌ను దుండగుడితో <<15707820>>చంపించిన<<>> మారుతీరావు
> ప్రణయ్ తండ్రి ఫిర్యాదుతో 8 మందిపై కేసు నమోదు
> 2019 JUN 12న అప్పటి SPరంగనాథ్ ఆధ్వర్యంలో 1600పేజీల ఛార్జిషీట్ రూపొందించిన పోలీసులు
> 2020 మార్చిలో మారుతీరావు సూసైడ్
> నేడు తుది తీర్పు

News March 10, 2025

నల్గొండ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ కుమార్

image

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఆదివారం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సైతం తమ అభ్యర్థిని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన దాసోజు శ్రవణ్ కుమార్‌కు ఈసారి అవకాశం కల్పించారు. ఆయన ఎంపిక పట్ల పలువురు వర్షం వ్యక్తం చేశారు.

News March 10, 2025

నల్గొండ: ఎమ్మెల్సీ సీపీఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం

image

శాసనమండలి ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం పేరు ఖారారైంది. హైదరాబాద్‌ మఖ్దూం భవన్‌లో ఆదివారం జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. నెల్లికంటి సత్యం సోమవారం ఉదయం 10గంటలకు నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నెల్లికంటి సత్యం NLG జిల్లా సీపీఐ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

error: Content is protected !!