News February 3, 2025
నల్గొండ: సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు
నల్గొండ జిల్లాలో నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ జరగనున్నాయి. సీసీ కెమెరాల నిఘాలో ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 44 సెంటర్లు ఏర్పాటు చేయగా 8,349 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లు జరగనున్నాయి. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా, ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News February 3, 2025
నల్గొండ: క్షుద్ర పూజల కలకలం
స్పేస్‌లోకి మనిషిని పంపే రోజులు వచ్చినా మూఢనమ్మకాలు, క్షుద్ర పూజలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. చండూరు మున్సిపాలిటీ పరిధిలోని గుండ్రపల్లి రోడ్డు RDO కార్యాలయానికి వెళ్లే దారి వద్ద క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. పట్టణం చివర్లో మూడు రోడ్లు కలిసే చోట పసుపు, కుంకుమ, కోడిగుడ్డు, కొబ్బరికాయతో క్షుద్ర పూజలు చేయడంతో స్థానికులు భయాందోళనకు గురువుతున్నారు.
News February 3, 2025
నల్గొండ: రేపటి నుంచి స్తంభగిరి బ్రహ్మోత్సవాలు
మర్రిగూడ మండల పరిధిలోని సరంపేట గ్రామ శివారులో గల స్తంభగిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 4వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరుగుతాయని ఆలయ అర్చకులు మారేపల్లి నర్సింహా చార్యులు తెలిపారు. 8న రాత్రి కళ్యాణం, 12న రథోత్సవం జరుగుతుందని చెప్పారు. మండలంలోని చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు వస్తారన్నారు.
News February 3, 2025
NLG: స్థానిక సమరానికి వడివడిగా అడుగులు
NLG జిల్లాలో స్థానిక సమరానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల బీసీ కుల గణన పూర్తి కావడం, ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం, తర్వాత క్యాబినెట్లో బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంటారనే సమాచారంతో గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. నల్గొండ జిల్లాలో 856 గ్రామపంచాయతీలు, 7392 వార్డులు ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించనున్న రిజర్వేషన్ల వైపు ఆశగా చూస్తున్నారు.