News February 7, 2025

నల్గొండలో నామినేషన్ వేయనున్న అభ్యర్థులు

image

నామినేషన్లకు 7, 10వ తేదీల్లోనే అవకాశం ఉండటంతో ఈ2 రోజుల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు ప్రధాన సంఘాల అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. శుక్రవారం TSUTF తరఫు ప్రస్తుత ఎమ్మెల్సీ ఆలుగుబెల్లి నర్సిరెడ్డి, అలాగే TPUS అభ్యర్థి సరోత్తంరెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి కూడా నామినేషన్లు సమర్పించనున్నారు. కాగా PRTU అభ్యర్థి శ్రీపాల్రెడ్డి 10న నామినేషన్ వేయనున్నట్లు సమాచారం.

Similar News

News February 7, 2025

DAY 5: కడప కలెక్టర్‌ను కలిసిన విద్యార్థులు

image

ప్రొద్దుటూరు మండలం గోపవరం పశు వైద్య కళాశాల విద్యార్థుల నిరసన ఐదో రోజుకు చేరింది. ఇవాళ వెటర్నరీ విద్యార్థులు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరిని, అలాగే కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిని కలిసి తమ సమస్యలు తెలుపుకున్నారు. తమ డిమాండ్లను వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. వీలైనంత త్వరగా తమకు స్టైఫండ్ ఇప్పించాలని కోరారు. లేదంటే చలో అమరావతి నిర్వహిస్తామని విద్యార్థులు హెచ్చరించారు.

News February 7, 2025

పేదలకు రూ.40 వేల ఇంజెక్షన్ ఉచితం: టీడీపీ

image

AP: గుండెపోటుకు గురైన పేషంట్ ప్రాణం నిలిపేందుకు మొదటి గంటలోపే ‘టెనెక్టెప్లేస్-40’ అనే ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని టీడీపీ ట్వీట్ చేసింది. రూ.40 వేల నుంచి రూ.45 వేల విలువైన ఈ టీకాను పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోందని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇది అందుబాటులో ఉందని తెలిపింది.

News February 7, 2025

KMR: పక్కడ్బందీగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్

image

జవహర్ నవోదయ విద్యాలయంలో 9వ తరగతి, ఇంటర్ 1st ఇయర్‌లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ సూచించారు. ఈ పరీక్షకు జిల్లాలో 14 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 9వ తరగతి పరీక్షకు 1739 మంది, ఇంటర్మీడియట్‌కు 2103 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు వివరించారు. పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.

error: Content is protected !!