News April 24, 2024
నల్గొండలో వారే కీలకం
NLG పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. మొత్తం ఓటర్లలో వారే అత్యధికంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో వారి తీర్పే కీలకం కానుంది. ఈ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 17,22,521 అందులో పురుషులు 8,43,496, మహిళలు 8.78,856, ట్రాన్స్ జెండర్లు 169 మంది ఉన్నారు. ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం మినహా మిగతా ఆరింటిలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.
Similar News
News February 5, 2025
నల్గొండ: రోడ్డుప్రమాదంలో యువకుడి మృతి
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని హ్యాపీ హోమ్స్ కాలనీ సమీపంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. కేశరాజుపల్లికి చెందిన మేకల మహేశ్ (25) పొలం వద్దకు వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో హ్యాపీ హోమ్స్ సమీపంలో బైక్ అదుపుతప్పి కరెంటు స్తంభానికి ఢీకొంది. దీంతో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
News February 5, 2025
చెర్వుగట్టులో కట్నాల రాబడి రూ.8.89 లక్షలు
చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం తెల్లవారుజామున శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణంలో భక్తులు సమర్పించిన కట్నాలు సాయంత్రం 4 గంటల వరకు లెక్కించగా రూ.8,89,445లు వచ్చినట్లు కార్యనిర్వహణ అధికారి నవీన్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ కృష్ణ, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ భాస్కర్ పాల్గొన్నారు.
News February 5, 2025
నల్గొండ: మోటర్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్
కనగల్ మండలంలో జీ.యడవల్లిలో విషాదం జరిగింది. విద్యుత్ షాక్‌కు గురై రైతు మృతిచెందాడు. హెడ్ కానిస్టేబుల్ ఎంఏ రషీద్ ఖాన్ తెలిపిన వివరాలిలా.. గ్రామానికి చెందిన మన్నెం గోపి(32) ఉదయం 11 గంటల సమయంలో పొలానికి వెళ్లాడు. పొలం వద్ద బోరు మోటర్‌ను ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు. మృతుడి తండ్రి యాదయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.