News February 21, 2025

నల్లజర్ల: గుండెపోటుతో పాస్టర్ మృతి

image

నల్లజర్ల మండలం, చీపురుగూడెం గ్రామానికి చెందిన పాస్టర్ గుండెపోటుతో గురువారం మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. చీపురుగూడెం గ్రామ నివాసి పాస్టర్ వెంకటేశ్వరరావు గుండెపోటుతో అకస్మాత్తుగా పడిపోవడంతో 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. అంబులెన్సు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి ఆయ‌న మృతి చెందినట్లు నల్లజర్ల 108 సిబ్బంది నిర్ధారించారు. 

Similar News

News February 22, 2025

కొవ్వూరు: హీరో రామ్‌ను కలిసిన మంత్రి దుర్గేశ్

image

కొవ్వూరు సమీపంలోని కుమారదేవంలో మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్లో జరుగుతున్న #RAPO22 షూటింగ్‌కి వచ్చిన ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పి.మహేష్ బాబులను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం మంత్రి దుర్గేశ్‌కి ఘన స్వాగతం పలికింది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.

News February 22, 2025

తూ.గో: ‘కెమికల్ పరిశ్రమలపై తనిఖీలు నిర్వహించాలి’

image

జిల్లాలోని కెమికల్ ఆధారిత, ఇతర పరిశ్రమలను సేఫ్టీ కమిటీ బృందాలు తరచూ తనిఖీలు నిర్వహించి, భద్రత ప్రమాణాలు, వాటినుంచి వెలువడే రసాయనాలను, వాయువులు స్థాయిని ఎప్పటికప్పుడు పరిశీలించి నివేదిక అందించాలని కలెక్టర్ ప్రశాంతి శనివారం రాజమండ్రిలో ఆదేశించారు. పరిశ్రమల్లో సాంకేతిక అంశాలకు సంబంధించి ఎక్కడ ఎటువంటి చిన్న తప్పిదం జరిగిన ఉపేక్షించే లేదని కలెక్టర్ హెచ్చరించారు.

News February 22, 2025

తూ.గో: బ్యాడ్మింటన్ సాత్విక్ తండ్రి మృతికి మోదీ సంతాపం

image

అమలాపురానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ తండ్రి కాశీ విశ్వనాథం మృతికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సంతాపం తెలిపారు. విశ్వనాథం మరణం పట్ల పీఎం విచారం వ్యక్తం చేస్తూ తండ్రి ప్రేరణతో సాత్విక్ సాయిరాజ్ బ్యాడ్మింటన్ ఆటగాడిగా ఎదిగిన విధానం ప్రస్తావించారు. విలువలు, కుటుంబానికి అందించిన మార్గదర్శకత, వారి జ్ఞాపకాలు ఎల్లప్పుడూ కుటుంబ సభ్యులను ప్రేరేపిస్తాయని ప్రధాని పేర్కొన్నారు.

error: Content is protected !!