News April 16, 2024
నల్లపాడు: పంట దిగుబడి రాలేదని మిర్చి రైతు ఆత్మహత్య

మిర్చి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై సోమవారం నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రైతు కన్నయ్య వెంగళాయపాలెం దగ్గర నాలుగు ఎకరాల పొలం కౌలుకు తీసుకొని అందులో మిర్చి పంట వేశాడు. సరైన దిగుబడి రాకపోవడం వలన తీసుకొచ్చిన అప్పులు తీర్చలేక తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. భార్య శాంతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 20, 2025
కొల్లిపర: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

కొల్లిపర మండలం గుడిబండి వారిపాలెంకి చెందిన గుంటూరు రత్న కుమారి (22) ఆదివారం మధ్యాహ్నం ఉరి వేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. కొల్లిపరలోని గవర్నమెంట్ హాస్పటల్‌కి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్ సుప్రియ నిర్ధారించారు. తెనాలి సీఐ ఆర్.ఉమేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 20, 2025
ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం : DEO

ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గుంటూరు DEO సి.వి రేణుక తెలిపారు. ఈ నెల 28 నుంచి మే 15 వరకు https://cse.ap.gov.in వెబ్ సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఐదేళ్ళు నిండిన వారికి ప్రస్తుతం 1వ తరగతికి అడ్మిషన్లు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. ఎంపిక రాష్ట్రస్థాయిలో ఉంటుందని, మే 16 నుంచి 20 వరకు వార్డు సచివాలయాల్లో డేటా ఆధారంగా అడ్మిషన్లు ఇస్తారని చెప్పారు.
News April 20, 2025
ఇద్దరు ఉపాధ్యాయులు సస్పెండ్: డీఈఓ

నల్లచెరువు అంబేడ్కర్ ఎయిడెడ్ పాఠశాలలో అవకతవకలకు పాల్పడిన ఇద్దరు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులను డీఈఓ సీవీ రేణుక సస్పెండ్ చేశారు. హాజరు తప్పుగా చూపడం, మధ్యాహ్న భోజన లబ్దిదారుల సంఖ్యను పెంచడం, రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వంటి ఆరోపణలపై జాకీర్ హుస్సేన్, డి. రవిపై చర్యలు తీసుకున్నారు. డీఈఓ తనిఖీలో 46 మందికి హాజరు వేసినా, కేవలం 9 మంది విద్యార్థులే ఉండటం గమనార్హం.