News March 2, 2025
నల్లబెల్లి: అర్ధ శతాబ్ద అపూర్వ కలయిక

1975 సంవత్సరంలో ఏడో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు 50 సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థులు కలుసుకొని బాల్యంలోని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఈవో దేవా, మురళి, సుభాష్, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 3, 2025
WGL: శ్రీపాల్ రెడ్డి నేపథ్యం ఇదే..!

వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ MLCగా విజయం సాధించిన పింగళి శ్రీపాల్ రెడ్డి మహబూబాబాద్ జిల్లా గూడూరులో జన్మించారు. ఆయనకు 52 ఏళ్లు. వృత్తి రీత్యా హనుమకొండలో స్థిరపడ్డారు. ఆయన గతంలో PRTU TS, UTF రాష్ట్ర అధ్యక్షుడిగా, అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(AIFTO) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేశారు. 2021లో జాతీయ ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశారు. కాగా ఇటీవల ఆయన తన టీచర్ పోస్ట్‌కు రాజీనామా చేశారు.
News March 3, 2025
భూపాలపల్లిలో యాక్సిడెంట్.. ముగ్గురి మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రాంపూర్ క్రాస్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాముత్తారం మండలం మీనాజీపేట గ్రామానికి చెందిన పింగిలి రాజిరెడ్డి, లడ్డు, పంబాపూర్‌కు చెందిన సతీష్‌గా ఘటనాస్థలిలోనే మృతిచెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 3, 2025
వరంగల్: MLC ఎన్నికలు.. మొదటి రౌండ్ ఫలితాలు

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు ఫలితాలను అధికారులు వెల్లడించారు.
1) PRTU అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి – 6,035
2) UTF అభ్యర్థి నర్సిరెడ్డి – 4,820
3) స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి- 4,437
4) స్వతంత్ర అభ్యర్థి పూల రవీందర్- 3,115
5) BJP మద్దతు అభ్యర్థి సరోత్తంరెడ్డి- 2,289
కాగా మొత్తం 19 మంది అభ్యర్థులకు చెల్లిన ఓట్లు 23,641, చెల్లని ఓట్లు 494