News February 28, 2025

నల్లబెల్లి: సోలార్ బ్యాటరీ దొంగలను అరెస్టు చేసిన ఎస్ఐ

image

నల్లబెల్లి, నర్సంపేట మండలాల్లో వివిధ గ్రామాల్లో సోలార్ లైట్‌కు సంబంధించిన 10 బ్యాటరీలను దొంగిలించి ఆటోలో వేసుకొని ములుగులో అమ్ముకునేందుకు వెళ్తుండగా నల్లబెల్లి పోలీస్ సిబ్బందితో పట్టుకున్నట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు. నిందితులను జ్యూడిషియల్ రిమాండ్ తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Similar News

News February 28, 2025

వరంగల్: నర్సంపేటలో విషాదం.. BRS నేత మృతి

image

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు బాణాల రాంబాబు శుక్రవారం గుండెపోటుతో మృతిచెందాడని స్థానికులు తెలిపారు. రాంబాబు భార్య ఇందిర 23వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేశారు. రాంబాబు మృతిపై స్థానికులు, పట్టణ బీఆర్ఎస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. పలువురు ఆయనకు నివాళులర్పించారు.

News February 28, 2025

వరంగల్: తెలంగాణ పిండివంటలను నేర్చుకున్న కేరళ యువత

image

కేరళ రాష్ట్రానికి చెందిన 27 మంది యువతీ యువకులు రంగశాయిపేటలోని హోమ్ ఫుడ్స్ సందర్శించారు. ఈనెల 20వ తేదీ నుండి మార్చ్ 3 వరకు ఐదు రోజుల పాటు ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం జరుగుతుందన్నారు. తెలంగాణ పిండివంటలైన సకినాలు, మురుకులు, గరిజలు, సర్వపిండి మొదలు వంటలను నిర్వాహకులు కేరళ నుంచి వచ్చిన యువతకు నేర్పారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు గురించి వారికి తెలియజేశారు.

News February 28, 2025

వరంగల్: పదవీ విరమణ పొందిన పోలీసులకు సన్మానం 

image

వరంగల్ జిల్లా కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘంగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందుతున్న పోలీస్ అధికారులకు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శాలువాతో సన్మానం చేసి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మీ సేవలు నేటితరం పోలీసులకు ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రవి సురేశ్ కుమార్, ఏసీపీలు నాగయ్య, సురేంద్ర, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!