News March 2, 2025

నల్లొండ: చదువుకు వయసుతో సంబంధం లేదు: కలెక్టర్ 

image

చదువుకోవడానికి వయసుతో సంబంధం లేదని మహిళలు చదువుకుంటే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. నేడు జిల్లా కేంద్రంలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి శిక్షణ పొందుతున్న మహిళలతో ఆమె మాట్లాడారు. 50 సంవత్సరాల తర్వాత చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్నవారూ ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News March 3, 2025

నకిరేకల్‌: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

image

నకిరేకల్‌ (M) తాటికల్లు ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో  సూర్యాపేట జిల్లా తుమ్మల పెన్‌పహాడ్ గ్రామానికి చెందిన ప్రభు, గుర్తుతెలియని మహిళ మృతి చెందారు. సూర్యాపేట నుంచి HYDకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతదేహాలను నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన కొడుకు మరణంపై మృతుడి తల్లి అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News March 3, 2025

అరుణాచల గిరి ప్రదర్శనకు ప్రత్యేక బస్సులు: ఆర్ఎం జానీ రెడ్డి

image

అరుణాచల గిరి ప్రదర్శన కోసం మార్చి 12వ తేదీ సాయంత్రం 7 గంటలకు అన్ని డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఉమ్మడి నల్గొండ రీజినల్ మేనేజర్ కే. జాని రెడ్డి తెలిపారు. ప్రతి పౌర్ణమికి రద్దీని బట్టి ప్రత్యేక సర్వీసులు నడిపిస్తామని, అరుణాచలం వెళ్లే భక్తులకు ఏపీలోని కాణిపాకం, తమిళనాడులోని వేలూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం కూడా ఉంటుందని వివరాలకు 92980 08888 సంప్రదించాలన్నారు.

News March 3, 2025

చిట్యాల: రోడ్డు ప్రమాదం.. బస్సులోనే ప్రసవం

image

ఆదివారం తెల్లవారుజామున చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో రోడ్డుప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కాగా, ప్రమాదానికి గురైన ప్రైవేటు బస్సులో ఏపీకి చెందిన గర్భిణి శశికళ HYD నుంచి కుటుంబ సభ్యులతో వెళ్తోంది. బస్సు చిట్యాలకు చేరుకున్న సమయంలో శశికళకు నొప్పులు రావడంతో 108 సమాచారం అందించారు. సమయానికి అంబులెన్స్ చేరుకోకపోవడంతో ఆమె బస్సులోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం NLG ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

error: Content is protected !!