News March 24, 2025

నస్రుల్లాబాద్: చెరువులో పడి వ్యక్తి మృతి

image

చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం నస్రుల్లాబాద్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. మండలంలోని నాచుపల్లి గ్రామానికి చెందిన కీసరి రాములు(37) ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Similar News

News March 26, 2025

నేడు విజయవాడకు వైఎస్ జగన్ షెడ్యూల్ ఇదే.!

image

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గురునానక్‌ కాలనీలోని NAC కళ్యాణ మండపానికి చేరుకుంటారు. అనంతరం జగన్ వైసీపీ ముస్లిం సోదరులకు ఇవ్వనున్న ఇఫ్తార్‌ విందులో పాల్గొంటారు. తిరిగి అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నేతలు భారీ సంఖ్యలో హాజరుకానున్నట్లు దేవినేని అవినాశ్ తెలిపారు. 

News March 26, 2025

మహబూబ్‌నగర్ జిల్లాకు రానున్న రాజాసింగ్

image

మహబూబ్‌నగర్ జిల్లాకు BJP నేత, HYD గోషామహల్ MLA రాజాసింగ్ రానున్నారు. కోయిల్‌కొండ మండలం రాంపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఏప్రిల్ 13న ఈ కార్యక్రమం జరగనుందని చెప్పారు. ఆ రోజు పాలమూరులోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున హిందూ బంధువులు తరలిరావాలని వారు పిలుపునిచ్చారు.

News March 26, 2025

MBNR: మున్సిపల్ కార్మికులకు దక్కిన గుర్తింపు..!

image

తెలంగాణలో ఏ జిల్లాలో లేని విధంగా పాలమూరు జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్మికులకు గుర్తింపు దక్కిందని స్థానికులు తెలిపారు. ప్రతిరోజు మున్సిపల్ కార్మికులు పరిసరాలను శుభ్రం చేస్తూ పట్టణాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు కష్టపడుతున్నారు. వారి సేవలను గుర్తించిన మున్సిపాలిటీ వారి విగ్రహాలను రోడ్డుపై ఏర్పాటు చేసింది. వారి కష్టాన్ని గుర్తించి, అందరూ అభినందించాలని ఈ సందర్భంగా అధికారులు పిలుపునిచ్చారు. 

error: Content is protected !!