News March 26, 2025

నా ఫొటోలను మార్ఫింగ్ చేశారు: గద్వాల MLA

image

తాను <<15888413>>BRSలోనే ఉన్నానని<<>> గద్వాల MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ.. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేని వారు మోసపూరితంగా ఫొటోలు మార్ఫింగ్ చేసి మీడియాకు విడుదల చేశారని అన్నారు. కాంగ్రెస్‌లో తాను చేరానని ప్రచారం చేయడంతో ప్రజల్లో అయోమయం నెలకొనే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే మీడియాలో వచ్చిన కథనాలపై 2025, FEB 11న గద్వాల PSలో ఫిర్యాదు చేయగా FIR కూడా నమోదైందన్నారు.

Similar News

News March 31, 2025

మహబూబ్‌నగర్: రంజాన్ పండుగ భద్రతను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ

image

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ డి.జానకి ఈద్గాను సందర్శించారు. ఈ సందర్భంగా ఈద్గా వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి పోలీస్ సిబ్బందితో మాట్లాడారు. శాంతిభద్రతలు, ప్రజల సౌకర్యం, శాంతియుతం,ట్రాఫిక్ నిర్వహణ, ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని సీసీ కెమెరాల పర్యవేక్షణ, అత్యవసర సేవల ఏర్పాట్లు ఈద్గా, మసీదులు ప్రధాన కూడళ్ల వద్ద అదనపు బందోబస్తు అంశాలపై అధికారులతో సమీక్షించారు.

News March 31, 2025

మహబూబ్‌నగర్: భారీ ధర్నాకు బీసీ సంఘం: గోనెల శ్రీనివాసులు

image

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 42 శాతం రిజర్వేషన్లను, కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంటులో అమలు చేయాలని బీసీ సంఘం డిమాండ్ చేసింది. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం నుంచి ఏప్రిల్ 2వ తారీఖున ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరిగే ధర్నా కార్యక్రమానికి బీసీ నాయకులు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోనెల శ్రీనివాసులు, మైత్రి యాదయ్య ముదిరాజ్, మురళి తదితరులున్నారు.

News March 31, 2025

మహబూబ్‌నగర్: రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి

image

మహబూబ్‌నగర్ రూరల్ మండల కేంద్రంలోని అన్ని గ్రామాల ముస్లిం ప్రజలు రంజాన్ పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మాజీ మంత్రి మాట్లాడుతూ.. రంజాన్ పండుగ మత సామరస్యానికి, సర్వ మానవ సమానత్వానికి, పవిత్రకు, త్యాగానికి, దాతృత్వానికి, మతసామరస్యానికి ప్రతీకలని వారన్నారు. కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆకాంక్షించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

error: Content is protected !!