News March 26, 2025

నా ఫొటోలను మార్ఫింగ్ చేశారు: గద్వాల MLA

image

తాను << 15888413>>BRSలోనే ఉన్నానని<<>> గద్వాల MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ.. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేని వారు మోసపూరితంగా ఫొటోలు మార్ఫింగ్ చేసి మీడియాకు విడుదల చేశారని అన్నారు. కాంగ్రెస్‌లో తాను చేరానని ప్రచారం చేయడంతో ప్రజల్లో అయోమయం నెలకొనే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే మీడియాలో వచ్చిన కథనాలపై 2025, FEB 11న గద్వాల PSలో ఫిర్యాదు చేయగా FIR కూడా నమోదైందన్నారు.

Similar News

News December 16, 2025

ఈనెల 18 వరకు జిల్లాలో ఆంక్షలు అమలు: SP

image

మెదక్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 18 వరకు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. ఆదేశాల ప్రకారం నలుగురు, అంతకంటే ఎక్కువ గుంపులుగా చేరడం, ర్యాలీలు, సమావేశాలు, సభలు నిర్వహించడం పూర్తిగా నిషేధమన్నారు. నిబంధనలు ఉల్లంఘించి నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

News December 16, 2025

AP-RCET ఫలితాలు విడుదల

image

పీహెచ్‌డీ సీట్ల భర్తీకి నిర్వహించే AP-RCET(రీసెర్చ్ కామన్స్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాలు విడుదలయ్యాయి. శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ ఆధ్వర్యంలో గత నెల నవంబరులో పరీక్షలు జరిగాయి. మొత్తం 65 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించగా, 5,164 మంది ఎగ్జామ్స్ రాశారు. వారిలో 2,859 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఏపీ ఆర్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.ఉష తెలిపారు. ఇక్కడ <>క్లిక్<<>> చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు.

News December 16, 2025

కరీంనగర్: SU M.Ed పరీక్ష ఫీజు నోటిఫికేషన్ విడుదల

image

శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలో జరుగనున్న M.Ed 1వ, 3వ సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ అధికారులు విడుదల చేశారు. దీనిలో భాగంగా అపరాధ రుసుం లేకుండా DEC 24 వరకు, లేట్ ఫీజు రుసుం రూ.500తో DEC 30 వరకు చెల్లించుకోవచ్చని SU పరీక్షల నియంత్రణ అధికారి డా.సురేశ్ కుమార్ తెలిపారు. పరీక్షలు JAN 2026 లో జరుగుతాయని తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్ లో చూడాలని లేదా ఆయా కళాశాలలో సంప్రదించాలన్నారు.