News March 7, 2025

నాగర్ కర్నూల్: గుర్తు తెలియని మహిళ మృతి

image

బిజినేపల్లి మండలం పోలేపల్లి గ్రామ శివారులోని కేఎల్ఐ కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ విషయాన్ని గురువారం స్థానికులు పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించారు. మహిళ ఎవరు? ఏవైనా అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.

Similar News

News March 9, 2025

కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

తెలుగు రాష్ట్రాల ప్రజలు బర్డ్‌ఫ్లూ భయం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. కొన్ని రోజులుగా కొత్త కేసులేవీ నమోదు కాకపోవడంతో చికెన్‌కు డిమాండ్ పెరుగుతోంది. హైదరాబాద్, ఆదిలాబాద్‌లో KG స్కిన్ లెస్ చికెన్ రూ.160-180గా ఉంది. ఖమ్మంలో రూ.150-170 ధర ఉంది. అటు ఏపీలోని విజయవాడలో కేజీ రూ.200, కాకినాడలో రూ.170-190, విశాఖలో రూ.190 వరకు పలుకుతోంది. మరి మీ ఏరియాలో చికెన్ రేట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News March 9, 2025

MBNR: ఆత్మహత్యాయత్నం చేసిన వృద్ధురాలు.!

image

ఓ వృద్ధురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సీసీ కుంట మండలం కురుమూర్తి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ రామ్‌లాల్ నాయక్ వివరాలు.. గ్రామానికి చెందిన చాకలి బాలకిష్టమ్మ మానసికస్థితి సరిగ్గా లేక ఒంటరిగా ఉంటుంది. దుప్పటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఒంటరితనాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొందని ఎస్ఐ తెలిపారు.

error: Content is protected !!