News June 11, 2024

నాగర్ కర్నూల్ జిల్లా విద్యార్థికి ఎడ్‌సెట్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్

image

బిజినెపల్లి మండలంలోని అల్లీపూర్ గ్రామానికి చెందిన నవీన్ కుమార్ బీఈడీ ప్రవేశ పరీక్ష ఎడ్‌సెట్‌లో సత్తా చాటాడు. ఈ ప్రవేశ పరీక్షలో 150 మార్కులకు గాను 118 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించాడు. నిరుపేద కుటుంబంలో పుట్టి, ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ గ్రూప్-1,2కు ప్రిపేర్ అవుతున్నారు. చదువుకొని రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించిన నవీన్ కుమార్‌ను గ్రామస్థులు, పలువురు అభినందించారు.

Similar News

News September 30, 2024

అంత్యక్రియలకు వెళ్తూ ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి

image

దౌల్తాబాద్ మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. అంత్యక్రియలకు వెళ్తూ ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటనలో ఒకరు మృతి చెందగా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు తెలిపిన వివారాలు.. దౌల్తాబాద్ మండలం నుంచి అంత్యక్రియల కోసం వెళ్తుండగా దేవర ఫసల్వాద్ సమీపంలో అదుపు తప్పి ఈర్లపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 30, 2024

ఉమ్మడి జిల్లా నేటి ఉష్ణోగ్రత వివరాలిలా

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా సోమవారం ఈ క్రింది విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లా కొత్తపల్లిలో 35.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గద్వాల జిల్లా చిన్నతండ్రపాడులో 35.4 డిగ్రీలు, నారాయణపేట జిల్లా గుండుమల్‌లో 33.2 డిగ్రీలు, వనపర్తి జిల్లా గణపూర్‌లో 32.7 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా పద్రాలో 31.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News September 30, 2024

జూరాల ప్రాజెక్టుకు తగ్గిన ఇన్‌ఫ్లో

image

జూరాలకు ఇన్ ఫ్లో తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆదివారం ఎగువ నుంచి 72 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు వివరించారు. 4 క్రస్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 5 యూనిట్లను కొనసాగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. గేట్ల ద్వారా, ఆవిరిరూపంలో, విద్యుదుత్పత్తి నిమిత్తం, కాల్వలకు ఇలా మొత్తంగా 68,647 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.