News March 20, 2025
నాగర్ కర్నూల్: దివ్యాంగులకు యూనిక్ డిజబిలిటీ కార్డుపై అవగాహన సదస్సు

యూడీఐడీ కార్డుపైగా అవగాహన సదస్సును ఈరోజు డీఆర్డీఏ ఆధ్వర్యంలో జిల్లాలోని దివ్యాంగుల సంఘం నాయకులతో కలిసి ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నాగర్‌కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజశేఖర్, నిరంజన్, గణేశ్ కుమార్, బాల పీర్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 28, 2025
కొండగట్టు: చిన్న జయంతి ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి చిన్న జయంతి ఉత్సవాలు సమీపిస్తున్నందున.. ఉత్సవ ఏర్పాట్లను అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఆమె ఆలయ పరిసర ప్రాంతాలను అధికారులతో కలిసి కలియతిరిగారు. ఆమె వెంట ఆర్డీవో మధుసూదన్, ఈవో శ్రీకాంత్ రావు, తహసీల్దార్ మునీందర్, ఆరై తిరుపతి, పర్యవేక్షకులు, సిబ్బంది ఉన్నారు.
News March 28, 2025
NZB: కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ

NZB నగర శివారులో ఓ మహిళ దారుణ హత్యకు గురైనట్లు తెలిసింది. మహిళ మృతదేహాన్ని కారు డిక్కీలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మృతురాలు కమలగా పోలీసులు గుర్తించారు. కంఠేశ్వర్ బైపాస్ వద్ద మహిళను హత్య చేసి, మాక్లూర్‌లోని దాస్ నగర్ కెనాల్‌లో పడేసేందుకు కారు డిక్కీలో మృతదేహాన్ని తరలిస్తుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 28, 2025
నక్కపల్లి: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన RI

నక్కపల్లిలో ఏసీబీ అధికారుల దాడులు కలకలం రేపాయి. గత కొంతకాలం నుంచి ఈ కార్యాలయంపై అనేక అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. పొలంలో బోరు కోసం ఒక రైతు నుంచి రూ.12 వేలు లంచం డిమాండ్ చేస్తూ ఆర్ఐ కన్నబాబు శుక్రవారం రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి ఆర్‌ఐ కన్నబాబును అరెస్ట్ చేశారు.