News March 22, 2024
నాగర్కర్నూల్ ఎంపీ బరిలో ఈసారి త్రిముఖ పోటీ..!

గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లు రవి, బీజేపీ అభ్యర్థిగా భరత్ పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. గత ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈసారి అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఇక్కడ బీజేపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
Similar News
News April 15, 2025
మహబూబ్ నగర్ జిల్లాలో.. ఒకే రోజు ఐదుగురి మృతి

MBNR జిల్లాలో ఒకేరోజు వేర్వేరు ఘటనల్లో సోమవారం ఐదు మంది మృతి చెందటం జరిగింది. జిల్లా కేంద్రం సమీపంలో దివిటిపల్లి వద్ద క్వారీ గుంతలో పడి విజయ్, సుశాంత్, మహమ్మద్ మృతి చెందగా.. బాలానగర్ మండలంలోని గంగాధర్పల్లిలో చేపలు పేటకు వెళ్లి రాములును కాపాడబోయి యాదయ్య కూడా గల్లంతయ్యాడు. ఈ రెండు ఘటనలతో మహబూబ్ నగర్ జిల్లాలో సోమవారం తీవ్ర విషాదం నెలకొంది. చనిపోయిన ఐదుగురు నిరుపేద కుటుంబాలు కావడం విశేషం.
News April 15, 2025
MBNR: విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా

MBNR పరిధిలో ఈతకు వెళ్లిన <<16098048>>ముగ్గురు యువకులు<<>> గల్లంతవగా అందులో ఒకరి మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. దివిటిపల్లి డబుల్ బెడ్ రూమ్ కాలనీకి చెందిన విజయ్, అయ్యప్ప, మహమ్మద్ సమీపంలోని క్వారీ గుంతలోకి ఈత కొట్టేందుకు వెళ్లారు. ముగ్గురికి ఈత రాకపోవడంతో నీళ్లలో మునిగిపోయారు. విజయ్ మృతదేహాన్ని అక్కడే ఉన్న కొందరు వెలికితీయగా మిగితా ఇద్దరి మృతదేహాల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
News April 15, 2025
మహబూబ్నగర్: మత్తు మందు ఇచ్చి.. అమ్మాయిపై అత్యాచార యత్నం!

ఓ బాలికపై యువకుడు అత్యాచారానికి యత్నించాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. MBNR మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక కోయిలకొండలోని వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు HYD నుంచి ఒంటరిగా వచ్చింది. MBNR చేరుకున్న ఆమె ఓ యువకుడి బైక్ ఎక్కి ఊరికి వెళ్తుండగా మార్గం మధ్యలో మత్తు మందు ఇచ్చి అమ్మాయిపై అత్యాచారానికి యత్నించాడు. తప్పించుకున్న ఆమెను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.