News March 31, 2025
నాగర్‌కర్నూల్: ఢిల్లీకి బయలుదేరిన కల్వకుర్తి నాయకులు

స్థానిక సంస్థల్లో, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఉద్దేశంతో ఈరోజు హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి వేలాది మంది బీసీ నాయకులు ప్రత్యేక రైల్లో ఢిల్లీకి బయలుదేరారు. ఏప్రిల్ 2న జంతర్ మంతర్ వద్ద జరిగే బీసీల పోరు గర్జన సభను విజయవంతం చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేశ్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. కల్వకుర్తి నుంచి నాయకులు వెళ్లారు.
Similar News
News April 3, 2025
భూపాలపల్లి ఏఐఎస్ఎఫ్ నాయకుల అరెస్ట్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూముల అమ్మకాలను నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా గురువారం ఉదయం HYD వెళ్తున్న ఏఐఎస్ఎఫ్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టులను పూర్తిగా ఖండించారు. యూనివర్సిటీ భూములను కాపాడుకుంటామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ తెలిపారు.
News April 3, 2025
మోదీ నాకు గొప్ప స్నేహితుడే కానీ..: ట్రంప్

పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధించిన ట్రంప్.. PM మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మోదీ నాకు గొప్ప స్నేహితుడు. కానీ భారత్ మమ్మల్ని సరిగా చూసుకోవడం లేదు. మాపై 52 శాతం టారిఫ్ విధిస్తోంది. మేము ఇండియాపై 26% సుంకం విధిస్తున్నాం’ అని చెప్పారు. సుంకాల ప్రకటనతో అమెరికాకు కంపెనీలు తిరిగి వస్తాయని, పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని ట్రంప్ తెలిపారు. US మార్కెట్లో పోటీతత్వం పెరిగి వస్తువుల ధరలు తగ్గుతాయన్నారు.
News April 3, 2025
సత్యవేడు MLAపై TDP అధిష్ఠానానికి ఫిర్యాదు

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి టీడీపీ నాయకులు షాక్ ఇచ్చారు. ఆయన తీరుతో పార్టీ నష్టపోతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకులకే ఎమ్మెల్యే ప్రాధాన్యమిస్తూ తమను అణగదొక్కుతున్నారని వాపోయారు. కొత్త ఇన్‌ఛార్జ్‌ను ప్రకటిస్తేనే అందరం కలిసి పనిచేస్తామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే హేమలతకు సత్యవేడు బాధ్యతలు అప్పగించాలని పలువురు కోరినట్లు సమాచారం.